కొత్త సినిమా ప్రకటించిన అఖిల్

ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ మూవీ సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా ప్రకటించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ తన కొత్త సినిమా ప్రకటించాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది.

అనీల్ సుంకరకు 9-నంబర్ సెంటిమెంట్ అందుకే 9వ నెల 9వ తేదీన ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఈ సినిమాను ప్రకటించాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

అఖిల్-సురేందర్ రెడ్డి సినిమాకు వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు. ఇంతకుముందు వక్కంతం-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. సో.. ఈ కాంబినేషన్ మరోసారి క్లిక్ అవుతుందని అఖిల్ ఆశపడుతున్నాడు.