ఆదిపురుష్ ముందే వస్తున్నాడు…

రాధేశ్యామ్ మూవీ తర్వాత ప్రభాస్ నుంచి థియేటర్లలోకి వచ్చే సినిమా ఏదనేది ఇప్పటికిప్పుడు కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ప్రభాస్ ను సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు అటు ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ తో పాటు.. నాగఅశ్విన్ కూడా ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వీళ్లలో ఓం రౌత్ ముందు అవకాశం దక్కించుకున్నాడు.

అవును.. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తీయబోతున్న ఆదిపురుష్ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి రాబోతోంది. ఈ నెలాఖరు నుంచి రాధేశ్యామ్ సినిమాను స్టార్ట్ చేయబోతున్న ప్రభాస్.. జనవరి నుంచి ఆదిపురుష్ ను మొదలుపెట్టబోతున్నాడు. ఆ తర్వాతే నాగఅశ్విన్ సినిమా ఉంటుంది.

అయితే ఆదిపురుష్, నాగఅశ్విన్ సినిమాల్లో ఏది ముందు థియేటర్లలోకి వస్తుందనేది మాత్రం చెప్పలేం. ఎందుకంటే ఆదిపురుష్ సినిమాకు గ్రాఫిక్ వర్క్ చాలా ఎక్కువ. కనీసం 8-9 నెలలు గ్రాఫిక్ వర్క్ చేయడానికి పడుతుంది. అటు నాగఅశ్విన్ పూర్తిగా సెట్స్ పై డిపెండ్ అయ్యాడు కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ కు అంత టైమ్ కేటాయించక్కర్లేదు.

సో.. ఈ రెండు సినిమాల్లో ఏది ముందుగా థియేటర్లలోకి వస్తుందనేది అప్పుడే చెప్పలేం.