Telugu Global
National

మూడు రాజధానులు తప్పుకాదు " కేంద్ర హోంశాఖ

ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానుల అంశంపై మరింత స్పష్టత ఇస్తూ హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ను కేంద్ర హోంశాఖ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ విభజన చట్టం ప్రకారం ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటులో తప్పులేదని తన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. విభజన చట్టంలో ఏపీకి ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. 2018లో అప్పటి ప్రభుత్వం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేసిందని […]

మూడు రాజధానులు తప్పుకాదు  కేంద్ర హోంశాఖ
X

ఆంధ్రప్రదేశ్‌ మూడు రాజధానుల అంశంపై మరింత స్పష్టత ఇస్తూ హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ను కేంద్ర హోంశాఖ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ విభజన చట్టం ప్రకారం ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటులో తప్పులేదని తన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. విభజన చట్టంలో ఏపీకి ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది.

రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని స్పష్టం చేసింది. 2018లో అప్పటి ప్రభుత్వం హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేసిందని వివరించింది. హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన అమరావతే రాజధాని అని చెప్పడానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది.

రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం మాత్రమే చేస్తామని కేంద్రం చెప్పింది. అంతకు మించి రాజధాని లేదా రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని అదనపు అఫిడవిట్‌లో వెల్లడించింది. రాజధానిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వాలని కూడా తన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

First Published:  10 Sep 2020 3:03 AM GMT
Next Story