Telugu Global
International

ప్లాస్మా థెరపీ పని చేయడం లేదు " ఐసీఎంఆర్‌

కరోనా బారిన పడిన వారికి అందిస్తున్న ప్లాస్మా థెరపీపై భారతీయ వైద్య పరిశోధన సంస్థ కీలక విషయాన్ని వెలువరించింది. ప్లాస్మా చికిత్స పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదని వెల్లడించింది. సాధారణ చికిత్సకు, ప్లాస్మా చికిత్సకు మధ్య ఫలితాల్లో పెద్దగా తేడా లేదని నిర్దారించింది. ఏప్రిల్ 22 నుంచి జులై 14 వరకు ప్లాస్మా చికిత్స ఫలితాలపై పరిశోధన చేసి ఈవిషయాన్ని వెల్లడించారు. 464 మంది కోవిడ్ బాధితులను ఎంపిక చేసి…. వారిలో 235 మందికి ప్లాస్మా ఎక్కించారు. […]

ప్లాస్మా థెరపీ పని చేయడం లేదు  ఐసీఎంఆర్‌
X

కరోనా బారిన పడిన వారికి అందిస్తున్న ప్లాస్మా థెరపీపై భారతీయ వైద్య పరిశోధన సంస్థ కీలక విషయాన్ని వెలువరించింది. ప్లాస్మా చికిత్స పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదని వెల్లడించింది. సాధారణ చికిత్సకు, ప్లాస్మా చికిత్సకు మధ్య ఫలితాల్లో పెద్దగా తేడా లేదని నిర్దారించింది. ఏప్రిల్ 22 నుంచి జులై 14 వరకు ప్లాస్మా చికిత్స ఫలితాలపై పరిశోధన చేసి ఈవిషయాన్ని వెల్లడించారు.

464 మంది కోవిడ్ బాధితులను ఎంపిక చేసి…. వారిలో 235 మందికి ప్లాస్మా ఎక్కించారు. మిగిలిన వారికి సాధారణ చికిత్స అందించారు. ఆ తర్వాత రెండు విధానాల్లో వస్తున్న ఫలితాలను క్రోడీకరించారు. రెండు గ్రూపుల్లోనూ తేడా పెద్దగా లేదని తేల్చారు. మరణాల రేటు కూడా ప్లాస్మా చికిత్స వల్ల తగ్గుతున్న దాఖలాలు కనిపించడం లేదని వివరించింది. జాతీయ టాస్క్‌ఫోర్స్‌ కూడా ఈ పరిశోధనను పరిశీలించి ఆమోదించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.

ప్లాస్మా థెరపీ సురక్షితమే అయినా ప్లాస్మాను నిలువ చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఐసీఎంఆర్‌ వివరించింది. ప్లాస్మా థెరపీపై ఇదివరకే చైనా, నెదర్లాండ్‌ దేశాలు కూడా పరిశోధనలు చేసి వాటిని మధ్యలోనే ఆపేశాయి.

First Published:  9 Sep 2020 9:25 PM GMT
Next Story