Telugu Global
National

బజారు మనుషులతో తిట్టించడం బాబుకు అలవాటే " కొడాలి నాని

చంద్రబాబు చిల్లర రాజకీయం గురించి తనకు నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచే తెలుసన్నారు మంత్రి కొడాలి నాని. ఎవరైనా విమర్శలు చేస్తే సోషల్ మీడియాలో పిచ్చికుక్కలు, ఊరకుక్కల ద్వారా తిట్టించడం, వర్లరామయ్యలాంటి పనికిమాలిన వాళ్లకు కాగితాలు ఇచ్చి ఫిర్యాదు చేయండి అని ఉసిగొల్పుతుంటారన్నారు. ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 లాంటి చానళ్లలో అడ్డమైన కొడుకులను పెట్టి బూతులు తిట్టించడం వంటివి చంద్రబాబు చేయిస్తుంటారని… ఇవన్నీ చిన్నప్పటి నుంచే తాను చూస్తున్నానని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు తన వెంట్రుక కూడా […]

బజారు మనుషులతో తిట్టించడం బాబుకు అలవాటే  కొడాలి నాని
X

చంద్రబాబు చిల్లర రాజకీయం గురించి తనకు నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచే తెలుసన్నారు మంత్రి కొడాలి నాని. ఎవరైనా విమర్శలు చేస్తే సోషల్ మీడియాలో పిచ్చికుక్కలు, ఊరకుక్కల ద్వారా తిట్టించడం, వర్లరామయ్యలాంటి పనికిమాలిన వాళ్లకు కాగితాలు ఇచ్చి ఫిర్యాదు చేయండి అని ఉసిగొల్పుతుంటారన్నారు.

ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 లాంటి చానళ్లలో అడ్డమైన కొడుకులను పెట్టి బూతులు తిట్టించడం వంటివి చంద్రబాబు చేయిస్తుంటారని… ఇవన్నీ చిన్నప్పటి నుంచే తాను చూస్తున్నానని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు తన వెంట్రుక కూడా పీకలేడన్నారు.

చంద్రబాబు లుచ్చా రాజకీయాలు తనకు బాగా తెలుసన్నారు. బజార్లలో తిరుగుతూ రాత్రిపూట బిజినెస్‌ చేసుకునే వారిని తీసుకొచ్చి ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 మైకుల ముందు తిట్టించడాలు ఇవన్నీ కొత్తేమీ కాదన్నారు. రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబును తాను విమర్శిస్తూనే ఉంటానన్నారు.

ఈ రాష్ట్రంలో రామోజీరావు, రాధాకృష్ణలు మాత్రమే తెలివైన వారు… మిగిలిన వారంతా పిచ్చోళ్లు… ఏం చెప్పినా వింటారు… అన్నట్టుగా వార్తలు రాస్తుంటారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. హాఫ్ నాలెడ్జ్ గాళ్లంతా వచ్చి టీవీల ముందు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు.

First Published:  10 Sep 2020 6:57 AM GMT
Next Story