మళ్లీ ఫైర్ అయిన మంచు లక్ష్మి

సుశాంత్ సింగ్ మరణంపై ఇప్పటికే ఓసారి రియాక్ట్ అయింది మంచు లక్ష్మి. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న రియాను సమర్థించి బాగా ట్రోలింగ్ కు గురైంది. ఇప్పుడు మరోసారి మంచు లక్ష్మి తెరపైకొచ్చింది. సుశాంత్ మరణం అనే అంశం నుంచి బాగా డబ్బులు సంపాదిస్తున్న మీడియాకు కంగ్రాట్స్ అంటూ మరోసారి ఫైర్ అయింది.

“సుశాంత్ సింగ్ మరణం అనే అంశం నుంచి, దేశానికి సేవ చేసిన ఓ కుటుంబాన్ని (రియా ఫ్యామిలీ) వేధించి డబ్బు సంపాదించిన ఇండియన్ మీడియా ఛానెళ్లకు అభినందనలు. నిజంగా నేను ఒక విషయం తెలుసుకోవాలను కుంటున్నాను. మీరు (మీడియా) నిజంగా సుశాంత్ ను పట్టించుకుంటున్నారా లేక అతడి ఫేమ్ ను వాడుకొని డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.”

ఇలా మరోసారి ఫైర్ అయింది మంచు లక్ష్మి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేశం బలమైన మహిళల మద్దతుతో, వాళ్ల పునాదులపై ఏర్పడిందని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేయాల్సి వస్తోందని బాధపడింది మంచు లక్ష్మి. ఆడ-మగ అనే తేడాను లింగబేధంతో కాకుండా విశాల దృక్పథంతో చూడాలని కోరుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కంటే సుశాంత్ కేసుపైనే జనాలకు ఎక్కువగా ఆసక్తి ఉందంటూ ఓ సర్వే రిపోర్ట్ కూడా షేర్ చేసింది లక్ష్మి.