రవిబాబు ఆఖరి అస్త్రం…. క్రష్

ఏ సక్సెస్ దక్కకపోతే దర్శకుల ఆఖరి అస్త్రం అడల్ట్ మూవీ. హిట్టవ్వకపోయినా, కనీసం ఓ నలుగురు మాట్లాడుకుంటారు. కలెక్షన్ కు ఢోకా ఉండదు. దర్శక-నిర్మాత ఎమ్మెస్ రాజు ఎప్పుడో ఈ బాట పట్టాడు. డర్టీ హరి అనే అడల్ట్ మూవీ తీశాడు. ఇప్పుడీ దారిలోకి మరో దర్శక-నిర్మాత రవిబాబు కూడా వచ్చాడు. అతడు తీస్తున్న-చేస్తున్న సినిమా క్రష్.

ఈ సినిమా ట్రయిలర్ ను ఈరోజు రిలీజ్ చేశాడు రవిబాబు. ఆ ట్రయిలర్ చూస్తే రవిబాబు ఏ జానర్ సెలక్ట్ చేసుకున్నాడనే విషయం ఈజీగా అర్థమైపోతుంది. ఏమాత్రం మొహమాటపడకుండా, సిగ్గు పడకుండా పక్కా అడల్ట్ మూవీ (పచ్చిగా చెప్పాలంటే బూతు సినిమా) తీసి జనాలమీదకు వదలబోతున్నాడు ఈ హీరో.

నటీనటులెవరో కూడా తెలియని ఈ ట్రయిలర్ గురించి ఇక్కడ చర్చించడానికి మాటలు రావు. కేవలం చూసి ఎవరికివారు అర్థంచేసుకోవాలంతే. అంత పచ్చిగా ఉంది ఈ క్రష్ ట్రయిలర్. చూస్తుంటే.. ఈ సినిమాతో కుర్రాళ్లను రవిబాబు బాగానే క్రష్ చేసేలా ఉన్నాడు.

అన్నట్టు ఇది కేవలం ఓటీటీని దృష్టిలో పెట్టుకొని రవిబాబు తీసిన సినిమా అనే విషయం అర్థమౌతూనే ఉంది. ఎందుకంటే, ఇలాంటి కంటెంట్ తో ఎవ్వరూ సెన్సార్ గుమ్మం తొక్కలేరు. నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడమే.