Telugu Global
National

కొడాలితో గొంతు కలిపిన వంశీ

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీలులేని చోట రాజధాని ఉండడానికి వీల్లేదంటున్న మంత్రి కొడాలి నాని వాదనకు మద్దతు పెరుగుతోంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పరోక్షంగా కొడాలితో గొంతు కలిపారు. చంద్రబాబు తెచ్చిన సీఆర్‌డీఏ పరిధిలో గన్నవరం, గుడివాడ, గుంటూరు, విజయవాడ కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. సీఆర్‌డీఏ పరిధిలో ఉన్నారు కాబట్టే తమ నియోజకవర్గ ప్రజలు కూడా అమరావతిలో చోటు కావాలంటున్నారని… అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇస్తే అమరావతి […]

కొడాలితో గొంతు కలిపిన వంశీ
X

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీలులేని చోట రాజధాని ఉండడానికి వీల్లేదంటున్న మంత్రి కొడాలి నాని వాదనకు మద్దతు పెరుగుతోంది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పరోక్షంగా కొడాలితో గొంతు కలిపారు. చంద్రబాబు తెచ్చిన సీఆర్‌డీఏ పరిధిలో గన్నవరం, గుడివాడ, గుంటూరు, విజయవాడ కూడా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

సీఆర్‌డీఏ పరిధిలో ఉన్నారు కాబట్టే తమ నియోజకవర్గ ప్రజలు కూడా అమరావతిలో చోటు కావాలంటున్నారని… అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ భూముల్లో ఇళ్ల పట్టాలు ఇస్తే అమరావతి జేఏసీకి అభ్యంతరం ఏమిటని వంశీ నిలదీశారు. 55 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అమరావతి జేఏసీ కూడా అంగీకరిస్తే … ఉద్యమానికి వీరి మద్దతు కూడా లభిస్తుంది కదా అని వంశీ ప్రశ్నించారు.

కొడాలి కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు. 55 వేల ఇళ్ల పట్టాలు ఇస్తే అమరావతి ప్రాంతంలో జనభా రెండులక్షలకు చేరుకుంటుందని కొడాలి చెబుతున్నారు. అప్పుడు రాజధాని అభివృద్ధి పుంజుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు.
జగన్‌మోహన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించిన రోజు… కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఒక వర్గం ప్రజలు కొద్దిగా బాధపడ్డారని వివరించారు. కానీ ఎప్పుడైతే 29 గ్రామాల ప్రజల తప్ప కృష్ణా, గుంటూరు జిల్లాలోని సీఆర్‌డీఏ పరిధి పేదలు కూడా కోర్ క్యాపిటల్‌లోకి అడుగు పెట్టకూడదని అమరావతి జేఏసీ కోర్టుకు వెళ్లడంతో ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఉద్యమం చేస్తున్న వారిని చూసి అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందని కొడాలి నాని వ్యాఖ్యానించారు.

రాజధానిలో ఇళ్ల స్థలాలు పొందే అర్హత గుంటూరు, కృష్ణా పేదలకు కూడా లేనప్పుడు అలాంటి చోట తాము వెళ్లి చట్టాలు చేయడం అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికే అవమానమని కొడాలి చెబుతున్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో కూడా పెద్దపెద్ద భవంతుల పక్కనే పేద వారి నివాసాలు కూడా ఉంటాయని… కానీ అమరావతిలో అలాంటి పరిస్థితి ఉండే అవకాశం కనిపించడం లేదన్నారు. అందుకే ఇలాంటి చోట శాసన రాజధాని కూడా ఉండడానికి వీల్లేదని తాను చెబుతున్నానన్నారు నాని.

First Published:  9 Sep 2020 9:36 PM GMT
Next Story