Telugu Global
National

సంవత్సరం పాటు ఇంట్లో బంధించి... అక్కర్లేని మందులు ఇచ్చారు… " అమీర్ ఖాన్ సోదరుడు ఫైజల్ ఖాన్

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సోదరుడు ఫైజల్ ఖాన్… తన కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశాడు. తన కుటుంబ సభ్యులు తనకు సంవత్సరం పాటు అనవసరమైన మందులు ఇచ్చారని తనని  గృహ నిర్బంధంలో ఉంచారని తెలిపాడు. ఫైజల్ ఖాన్ 1999లో వచ్చిన మేలా అనే సినిమాలో నటించాడు. తనకు డిప్రెషన్, స్కీజో ఫ్రీనియా ఉన్నట్టుగా తన కుటుంబం భావించిందని… అయినా తాను మౌనంగా ఉన్నానని, నిజం వాళ్లే తెలుసుకుంటారని ఎదురు చూశానని ఫైజల్ ఖాన్ తెలిపాడు. ఇటీవల ఒక […]

సంవత్సరం పాటు ఇంట్లో బంధించి... అక్కర్లేని మందులు ఇచ్చారు…  అమీర్ ఖాన్ సోదరుడు ఫైజల్ ఖాన్
X

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సోదరుడు ఫైజల్ ఖాన్… తన కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశాడు. తన కుటుంబ సభ్యులు తనకు సంవత్సరం పాటు అనవసరమైన మందులు ఇచ్చారని తనని గృహ నిర్బంధంలో ఉంచారని తెలిపాడు.

ఫైజల్ ఖాన్ 1999లో వచ్చిన మేలా అనే సినిమాలో నటించాడు. తనకు డిప్రెషన్, స్కీజో ఫ్రీనియా ఉన్నట్టుగా తన కుటుంబం భావించిందని… అయినా తాను మౌనంగా ఉన్నానని, నిజం వాళ్లే తెలుసుకుంటారని ఎదురు చూశానని ఫైజల్ ఖాన్ తెలిపాడు. ఇటీవల ఒక సినిమా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించాడు.

‘నాకు పిచ్చి ఉంటే నేను ఏదో ఒకరకంగా చూపించేవాడిని కదా…నన్ను ఇబ్బంది పెడుతున్నారన్న సంగతి వారికి అర్థమయ్యే వరకు మౌనంగానే ఉండాలని అనుకున్నాను. తరువాత జెజె హాస్పటల్ లో ఇరవై రోజుల పాటు నిపుణుల పరిశీలనలో ఉన్నాను. వారు నాకేమీ లేదని తేల్చారు. మానసికంగా నేను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. అయితే సంవత్సరం పాటు నా కుటుంబం నాకు అవసరం లేకున్నా మందులు ఇవ్వటం మాత్రం భరించలేని విషయం’ అంటూ తన మనసులోని మాటలను చెప్పుకొచ్చాడు ఫైజల్ ఖాన్.

కుటుంబం తనని… తన సంతకం వినియోగించుకునే హక్కుని వదులుకోమని చెప్పినప్పుడు… ఇక సహించలేని స్థితిలో కోర్టుకి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా అతను తెలిపాడు. తనసోదరుని 50వ పుట్టిన రోజు వేడుకల్లో కరణ్ జోహార్ తనని తీవ్రంగా అవమానించాడని, అలాంటి అవమానాలు జీవితంలో చాలా భరించానని అన్నాడు. ఫైజల్ ఖాన్ ప్రస్తుతం ఫ్యాక్టరీ అనే సినిమాలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు.

First Published:  11 Sep 2020 2:08 AM GMT
Next Story