Telugu Global
National

ప్రతిపక్షాల నోటికి తాళం... కేంద్రం కోర్టులో అంతర్వేది అంశం...

అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రతిపక్షాల విమర్శలకు తెలివిగా చెక్ పెట్టారు సీఎం జగన్. అంతర్వేదిలో రథం దగ్ధమైన విషయంలో మత రాజకీయాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేస్తున్నారు. అంతర్వేది అంశంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాల ఊహకు అందనిదే. సీబీఐ ఎంక్వయిరీ అనే సింగిల్ అజెండాతో నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు పెచ్చుమీరుతున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ.. మూడు పార్టీలు ఒకే నినాదంతో ముందుకు రావడం విశేషం. వాస్తవానికి రాష్ట్ర పోలీస్ […]

ప్రతిపక్షాల నోటికి తాళం... కేంద్రం కోర్టులో అంతర్వేది అంశం...
X

అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రతిపక్షాల విమర్శలకు తెలివిగా చెక్ పెట్టారు సీఎం జగన్. అంతర్వేదిలో రథం దగ్ధమైన విషయంలో మత రాజకీయాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేస్తున్నారు. అంతర్వేది అంశంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాల ఊహకు అందనిదే.

సీబీఐ ఎంక్వయిరీ అనే సింగిల్ అజెండాతో నాలుగు రోజులుగా రాష్ట్రంలో ఆందోళనలు పెచ్చుమీరుతున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ.. మూడు పార్టీలు ఒకే నినాదంతో ముందుకు రావడం విశేషం.

వాస్తవానికి రాష్ట్ర పోలీస్ ప్రాథమిక విచారణలో రథం దగ్గర్లో ఉన్న తేనెతుట్టెను ఎవరో తగలబెట్టేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి మంటలు రథానికి అంటుకున్నాయనే విషయం బైటపడింది. కానీ ప్రతిపక్షాలు ఈ వివరణతో సంతృప్తి చెందడంలేదు, దీని ద్వారా రాజకీయ లబ్ధిపొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పాత విషయాలన్నిటినీ తవ్వి తీస్తూ జగన్ ప్రభుత్వాన్ని హిందూ ద్వేషిగా చిత్రీకరిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఏ విచారణలో ఏం తేలినా, ప్రతిపక్షాలు అందుకు ఒప్పుకోవు. అందుకే బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేశారు జగన్. సీబీఐ ఎంక్వయిరీకోసం రాష్ట్ర డీజీపీకి ఆదేశాలిచ్చారు. వెంటనే డీజీపీ కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో ఆ తంతు పూర్తయింది. ఒకరకంగా ప్రతిపక్షాల నోటికి తాళం పడ్డట్టయింది.

సీబీఐ ఎంక్వయిరీ ఎన్నిరోజులు సాగినా, అందులో ఏం తేలినా విమర్శించే సాహసం ఆ మూడు పార్టీలు చేయలేవు. కోరి కోరి సీబీఐ ఎంక్వయిరీ వేయించుకుంటున్నారు, అందులోనూ కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కారే, ఇక సీబీఐ ఈ విషయాన్ని తేల్చే వరకు రాష్ట్రంలో ఆందోళనలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మహా అయితే మా ఒత్తిడికి తలొగ్గి జగన్ సీబీఐ ఎంక్వయిరీ వేశారు అనుకునే ప్రతిపక్షాల అల్పసంతోషాన్ని ఎవరూ కాదనలేరు.

First Published:  10 Sep 2020 9:29 PM GMT
Next Story