జేపీకి సంబంధించి ఈ మేటర్ మీకు తెలుసా?

జయప్రకాష్ రెడ్డికి సంబంధించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసిన మేటర్ ఇది. అదేంటంటే.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు.

అవును.. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో జయప్రకాష్ రెడ్డిది చప్పిడి ముక్కు. ఈ పదప్రయోగం కూడా ఆయనదే. అందుకే ఇలా డైరక్ట్ గా రాస్తున్నాం. దాన్ని సరిచేయించుకుంటే చాలా బాగుంటుందని ఎంతోమంది చెప్పగా.. ఆయన సన్నిహితుడు ఒకాయన జయప్రకాష్ రెడ్డిని ఓ ప్లాస్టిక్ సర్జన్ కు పరిచయం చేశాడు.

కేరళకు చెందిన ఆ డాక్టర్ చెన్నైలో సర్జన్ గా ఉంటున్నాడు. ఆయన జేపీకి ప్లాస్టిక్ సర్జరీ చేసి ముక్కును కొంత సరిచేశారు. అయితే అది మొత్తం పూర్తికాలేదు. 6 నెలలు గ్యాప్ ఇచ్చి సెకెండ్ సిట్టింగ్ లో మిగతాది పూర్తిచేస్తానని ఆ డాక్టర్ చెప్పారు. జేపీ కూడా అందుకు ఒప్పుకున్నారు.

అయితే ఊహించని విధంగా కేరళ నుంచి చెన్నై వస్తున్న ఆ వైద్యుడు యాక్సిడెంట్ లో చనిపోయాడు. అప్పటికే తనకు బాగా క్లోజ్ అయిన డాక్టర్ చనిపోవడంతో జేపీ తట్టుకోలేకపోయారు. ఆ బాధతో తన ముక్కు ప్లాస్టిక్ సర్జరీని అలా మధ్యలోనే వదిలేశారు.

అందుకే ఆయనకు ముక్కుపైన పెద్ద దెబ్బ తగిలినట్టు కనిపిస్తుంది. ఎక్కువగా ఫ్యాక్షన్ లీడర్ పాత్రలు పోషించడం, రాయలసీమకు చెందిన వ్యక్తి కూడా కావడంతో.. నిజంగానే జరిగిన ఫ్యాక్షన్ గొడవల్లో జేపీ ముక్కుకు దెబ్బ తగిలిందంటూ ఆయన సన్నిహితులు ఆయన్ను ఆటపట్టించేవారు.

జయప్రకాష్ రెడ్డికి సంబంధించి చాలామందికి తెలియని విషయం ఇది. ఇటీవల జేపీ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే.