Telugu Global
National

వచ్చే నెలలో ఉల్లి ధర... వందకు చేరుతుందా?!

అక్టోబరులో ఉల్లిపాయల ధర ఆకాశానికి అంటుతుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. వర్షాలు ఎక్కువగా కురవటంతో పంట పాడవటం, పండించిన పంటను సరిగ్గా భద్రపరచలేకపోవటం… ఈ రెండు కారణాల వలన ఇప్పటికే దేశవ్యాప్తంగా రిటైల్, హోల్ సేల్ మార్కెట్లలో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయని ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లిపాయల మార్కెట్ వర్గాలు చెబుతున్నదాన్ని బట్టి….ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఖరీఫ్ సీజన్ మొదట్లో పండించిన  ఉల్లిపాయలను జులై నుండి సెప్టెంబరు వరకు దేశవ్యాప్తంగా సప్లయి చేస్తుంటారు… కానీ భారీగా కురిసిన వర్షాల […]

వచ్చే నెలలో ఉల్లి ధర... వందకు చేరుతుందా?!
X

అక్టోబరులో ఉల్లిపాయల ధర ఆకాశానికి అంటుతుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. వర్షాలు ఎక్కువగా కురవటంతో పంట పాడవటం, పండించిన పంటను సరిగ్గా భద్రపరచలేకపోవటం… ఈ రెండు కారణాల వలన ఇప్పటికే దేశవ్యాప్తంగా రిటైల్, హోల్ సేల్ మార్కెట్లలో ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయని ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు.

ఉల్లిపాయల మార్కెట్ వర్గాలు చెబుతున్నదాన్ని బట్టి….ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఖరీఫ్ సీజన్ మొదట్లో పండించిన ఉల్లిపాయలను జులై నుండి సెప్టెంబరు వరకు దేశవ్యాప్తంగా సప్లయి చేస్తుంటారు… కానీ భారీగా కురిసిన వర్షాల కారణంగా పంట పాడయ్యింది.

గుజరాత్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ ఇంకా ఉల్లిని ఎక్కువగా పండించే రాష్ట్రాల్లో వర్షాల కారణంగా నిల్వచేసిన పంట కూడా దెబ్బతిన్నది. దాంతో ప్రధానంగా ఉల్లిని పండించే రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో హోల్ సేల్, రిటైల్ ధరలు రెట్టింపు అయ్యాయి. ముంబయి, కోల్ కతాల్లో రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ. 50కి చేరగా ఢిల్లీలో రూ.60 ఉంది. దేశంలోనే అతిపెద్ద ఉల్లిపాయల హోల్ సేల్ మార్కెట్ అయిన… నాసిక్ లోని లాసల్ గోన్ మార్కెట్లో ఆగస్టు 28న కిలో ఉల్లిపాయల ధర రూ.12 ఉంటే… అది ఈ నెల 8వ తేదీకి రూ. 29కి చేరింది.

ఢిల్లీలోని అజాద్ పూర్ మండీ ఆసియాలోనే అతిపెద్ద పళ్లు, కూరగాయల మార్కెట్. ఢిల్లీకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడినుండి సరుకు సప్లయి అవుతుంటుంది. ఇక్కడ ఉల్లి సప్లయి యాభై శాతం వరకు తగ్గిపోవటంతో హోల్ సేల్ ధర ఈ నెల 9వ తేదీ నాటికి రూ. 23కి చేరింది. ఆగస్టు 27న ఈ ధర రూ. 8గా ఉంది.

నవంబరుకి గానీ కొత్త పంట వచ్చే అవకాశం లేదు కాబట్టి… ఇప్పుడు కనబడుతున్న మార్కెట్ సరళిని బట్టి చూస్తే… వచ్చే నెల నాటికి కేజీ ఉల్లి ధర రూ. 100 కు చేరుతుందని పలువురు వ్యాపారులు అంటున్నారు. ఉల్లి లొల్లి మరోసారి మొదలవబోతున్నదన్నమాట.

First Published:  11 Sep 2020 6:56 AM GMT
Next Story