Telugu Global
National

వైసీపీ మద్దతు ఈసారి ఎవరికి?

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోసం బీహర్ సీఎం నితీష్ కుమార్ జగన్‌ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎన్‌డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన హరివంశ్‌ నారాయణ సింగ్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. 245 మంది సభ్యుల రాజ్యసభ సభలో ప్రస్తుతం 244 మంది సభ్యులున్నారు. ఎన్నికల్లో మేజిక్‌ ఫిగర్ 123గా ఉంది. బీజేపీకి సొంతంగా 87 మంది రాజ్యసభ ఎంపీలున్నారు. ఇప్పటికే మద్దతు ఇస్తున్న పార్టీల సంఖ్యా బలాన్ని కలుపుకుంటే అది 110 […]

వైసీపీ మద్దతు ఈసారి ఎవరికి?
X

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోసం బీహర్ సీఎం నితీష్ కుమార్ జగన్‌ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎన్‌డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన హరివంశ్‌ నారాయణ సింగ్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. 245 మంది సభ్యుల రాజ్యసభ సభలో ప్రస్తుతం 244 మంది సభ్యులున్నారు. ఎన్నికల్లో మేజిక్‌ ఫిగర్ 123గా ఉంది.

బీజేపీకి సొంతంగా 87 మంది రాజ్యసభ ఎంపీలున్నారు. ఇప్పటికే మద్దతు ఇస్తున్న పార్టీల సంఖ్యా బలాన్ని కలుపుకుంటే అది 110 దాటుందని ఎన్‌డీఏ లెక్కలేస్తోంది. తటస్థ పార్టీల్లో కొన్నింటి మద్దతు సాధించినా గెలుపు ఖాయమని ఎన్‌డీఏ ధీమా వ్యక్తం చేస్తోంది.

బరిలో ఉన్న హరివంశ్‌ తన పార్టీ వ్యక్తే కావడంతో బీహర్‌ సీఎం నితీష్‌ కుమార్‌ నేరుగా రంగంలోకి దిగారు. పలు తటస్త పార్టీలకు ఫోన్ చేసి మద్దతు కోరుతున్నారు. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డికి నితీష్ కుమార్‌ ఫోన్ చేసి మద్దతు కోరారు.

తొలి నుంచి కూడా రాజ్యాంగ బద్ద పదవుల విషయంలో రాజకీయ కోణంలో చూడకూడదని వైసీపీ చెబుతూ వస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ రామ్‌నాథ్ కోవింద్‌కు వైసీపీ మద్దతు తెలిపింది. కేంద్రంతో సానుకూలంగా ఉంటూ రాష్ట్రానికి కావాల్సింది సాధించుకోవడమే తమ తొలి ప్రాధాన్యత అని జగన్‌మోహన్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. కాబట్టి డిప్యూటీ చైర్మన్‌ విషయంలో ఎన్‌డీఏ అభ్యర్థికే వైసీపీ మద్దతు ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

యూపీఏ కూడా తన అభ్యర్థిని బరిలో దింపుతోంది. కానీ వారి బలం మిత్రులతో కలుపుకుని కూడా 100కు చేరే అవకాశాలు కనిపించడం లేదు. ఈ కారణంగా తటస్థ పార్టీలు అధికార పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశాలుకనిపిస్తున్నాయి.

First Published:  11 Sep 2020 6:58 AM GMT
Next Story