శృతిహాసన్ మనసులో కోరిక

లాక్ డౌన్ ముగిసి పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత అర్జెంట్ గా ఓ రెస్టారెంట్ కు వెళ్తానంటోంది శృతిహాసన్. నిజానికి ఇప్పుడు రెస్టారెంట్లు అన్నీ తెరిచే ఉన్నాయి. కావాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని, శృతిహాసన్ హ్యాపీగా వెళ్లొచ్చు. అయితే ఇక్కడో చిక్కుంది. శృతిహాసన్ కు ఇష్టమైన ఆ రెస్టారెంట్ ఇక్కడ లేదు. లండన్ లో ఉంది.

అవును.. లండన్ లోని బోన్ డాడీస్ రెస్టారెంట్ అంటే శృతిహాసన్ కు చాలా ఇష్టం. ఎక్కువగా లండన్ లోనే ఉండడానికి ఇష్టపడే ఈ చిన్నది, ఎప్పటికప్పుడు ఇదే రెస్టారెంట్ లో కాలక్షేపం చేస్తూ ఉండేది. ఆ రెస్టారెంట్ అంటే తనకు ఇష్టమని, లాక్ డౌన్ వల్ల అది మిస్సయ్యానని అంటోంది శృతి.

అయితే ఇప్పటికిప్పుడు లండన్ వెళ్లి ఆ రెస్టారెంట్ లో ఎంజాయ్ చేసే టైమ్ శృతిహాసన్ కు లేదు. ఆమె చేతిలో ఓ హిందీ సినిమా ఉంది. అది పూర్తి చేయాలి. ఆ తర్వాత పవన్ సరసన వకీల్ సాబ్ సినిమా చేయాల్సి ఉంది. అటు తమిళ్ లో కూడా ఓ సినిమా కమిట్ మెంట్ ఉంది. ఇవన్నీ పూర్తయితే తప్ప శృతిహాసన్ లండన్ వెళ్లడం కుదరదు.