నాక్కూడా అలాంటి అనుభవాలున్నాయి

తనకు కూడా నెపొటిజం అనుభవాలున్నాయని బయటపెట్టింది హీరోయిన్ అదితి రావు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో పనిచేసిన ఈ హీరోయిన్, కెరీర్ స్టార్టింగ్ లో తను కూడా వివక్షకు గురయ్యానని, కొన్ని సినిమా అవకాశాలు చేజారయని చెప్పుకొచ్చింది. అయితే ఆ అనుభవాలు ఏ పరిశ్రమలో జరిగాయనే విషయాన్ని మాత్రం ఆమె బయటపెట్టలేదు.

బయట నుంచి వచ్చే ప్రతి వ్యక్తికి నెపొటిజం అనుభవాలుంటాయని, కానీ అందరూ వాటిని బయటకు చెప్పుకోరని అంటోంది అదితి. అదే సమయంలో నెపొటిజంలో తప్పు లేదని వాదిస్తోంది ఈ బ్యూటీ. పరిశ్రమలో ఉన్న పెద్దలు తమ పిల్లల్ని అదే రంగంలోకి తీసుకురావడం సహజమని అంటోంది.

బయట నుంచి వచ్చే వ్యక్తులకు ఒక ఛాన్స్ వస్తే.. నెపోకిడ్స్ కు 10 అవకాశాలు వస్తాయని.. అది సహజమని చెబుతోంది. అయితే అవకాశాలు ఎన్ని వచ్చాయన్నది ముఖ్యం కాదంటోంది అదితి. వాటిని ఎలా సద్వినియోగం చేసుకున్నామనేది ఇంపార్టెంట్ అంటోంది. ప్రేక్షకులు ఆదరించకపోతే.. బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఉపయోగం ఉండదని అంటోంది.