Telugu Global
National

అమరావతి భూకుంభకోణం వెనుక చంద్రబాబు " ఏపీ సిట్

అమరావతి భూముల కుంభకోణం వెనుక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యప్తు బృందం (సిట్) చెబుతున్నది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ఏ ప్రాంతంలో వస్తున్నదో ముందుగానే చెప్పి తమ కుటుంబ సభ్యులకు లాభం చేకూర్చారని సిట్ తేల్చింది. అయితే సిట్ దర్యాప్తును టీడీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. దర్యాప్తు బృందం ఆరోపణలు న్యాయస్థానం ముందు నిలబడవని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో క్యాబినెట్ సబ్-కమిటి కనుగొన్న అంశాలను ఉదహరిస్తూ సిట్ […]

అమరావతి భూకుంభకోణం వెనుక చంద్రబాబు  ఏపీ సిట్
X

అమరావతి భూముల కుంభకోణం వెనుక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యప్తు బృందం (సిట్) చెబుతున్నది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ఏ ప్రాంతంలో వస్తున్నదో ముందుగానే చెప్పి తమ కుటుంబ సభ్యులకు లాభం చేకూర్చారని సిట్ తేల్చింది. అయితే సిట్ దర్యాప్తును టీడీపీ నాయకులు కొట్టిపారేస్తున్నారు. దర్యాప్తు బృందం ఆరోపణలు న్యాయస్థానం ముందు నిలబడవని చెబుతున్నారు.

ఈ వ్యవహారంలో క్యాబినెట్ సబ్-కమిటి కనుగొన్న అంశాలను ఉదహరిస్తూ సిట్ నివేదిక తయారు చేసింది. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమ అధికారాలను దుర్వినియోగం చేసి విశ్వాస భంగానికి పాల్పడ్డారని నివేదికలో పేర్కొన్నది.

రాజధాని సరిహద్దులను తారుమారు చేసి అధికారంలో ఉన్న వ్యక్తుల, సన్నిహితుల భూములను కాపాడారని ఆరోపించింది. రాజధాని ప్రాంతానికి ఆనుకునే ఉన్న వారి భూములను ల్యాండ్ పూలింగ్‌లోకి తీసుకోలేదని చెప్పింది. అమరావతి రాజధాని ప్రకటన రాక ముందే బినామీల చేత భూములు కొనిపించినట్లు ఆధారాలు ఉన్నట్లు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా కనుగొన్నట్లు సిట్ నివేదికలో చెప్పింది.

అప్పటి మంత్రి నారా లోకేష్ బినామీలు, వ్యాపార సంస్థల పేర్ల మీద 62 ఎకరాలు కొన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అంతే కాకుండా మరి కొంత మంది ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్ భూములను అక్రమంగా కొని వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపింది. రాజధాని భూముల వ్యవహారంలో చంద్రబాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు సబ్ కమిటీనే కాకుండా సిట్ కూడా ఆరోపిస్తున్నది.

చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అతని కుటుంబం క్లాసిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 1.3 ఎకరాల భూమిని మందడం గ్రామంలో కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ భూమిపై ఇతర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని.. ఇవన్నీ అమరావతి రాజధాని ప్రకటన రాకముందే జరిగినట్లు నివేదికలో పేర్కొంది. ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి స్థాయి విచారణ ప్రారంభించక ముందే ఈ కేసులను సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైలు సిబ్బంది, పిర్యాదుల మంత్రిత్వ శాఖ వద్ద ఉన్నది. ఇప్పటికే ఈ స్కామ్‌కు సంబంధించిన పత్రాలను ఈడీ, సీబీఐ, ఇతర దర్యాప్తు బృందాలకు అనువదించారు.

సబ్ కమిటీని నియమించడం, సిట్ ఏర్పాటు చేస్తూ వెలువరించిన జీవోలను సస్పెండ్ చేయాలని కోరుతూ టీడీపీ పోలిట్‌‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్, సబ్ కమిటీల నివేదికలకు న్యాయపరంగా విలువ లేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్, అమరావతి రాజధానికి సంబంధించిన వ్యవహారాలన్నీ నిబంధనల మేరకే జరిగాయని, ఇందులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని ఆయన అంటున్నారు. అమరావతి ప్రకటన వచ్చిన తర్వాతే భూముల కొనగోళ్లు జరిగాయని, ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ కూడా జరిగాయని.. సిట్, సబ్ కమిటీ ఆరోపణలు న్యాయ విచారణ ముందు నిలబడవని రామయ్య అన్నారు.

ప్రాథమిక విచారణలో చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు ఉన్నా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఒక వేళ నిజంగా సాక్ష్యాలు ఉంటే వాళ్లెందుకు కేసు నమోదు చేయడం లేదని ఆయన అంటున్నారు. సిట్ దర్యాప్తు విఫలమైనందునే ఇప్పుడు సీబీఐ దర్యాప్తు అంటూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదికనే అటుఇటు మార్చి సిట్ నివేదిక ఇచ్చిందని రామయ్య ఆరోపించారు.

First Published:  11 Sep 2020 11:47 PM GMT
Next Story