Telugu Global
National

ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరుంటుంది " బొత్స

రాజధాని భూ కుంభకోణం ఎఫ్‌ఐఆర్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేరు ఉంటుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చట్టం అందరికీ సమానమేనని… తన పని తాను చేసుకుపోతుందన్నారు. అమరావతి భూములు పేదలవని తాము తొలి నుంచే చెబుతున్నామన్నారు. రాజధాని ప్రకటనకు ముందే అమరావతి ప్రాంతంలో పేదలను మభ్యపెట్టి, మోసం చేసి తన వాళ్ల చేత చంద్రబాబు భూములను కొనుగోలు చేయించారన్నారు. దర్యాప్తుకు ముందు మాత్రం దమ్ముంటే దర్యాప్తు చేసుకోండి అన్నారని… ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంటే అన్యాయం అంటూ కోర్టుకు […]

ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరుంటుంది  బొత్స
X

రాజధాని భూ కుంభకోణం ఎఫ్‌ఐఆర్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేరు ఉంటుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. చట్టం అందరికీ సమానమేనని… తన పని తాను చేసుకుపోతుందన్నారు. అమరావతి భూములు పేదలవని తాము తొలి నుంచే చెబుతున్నామన్నారు. రాజధాని ప్రకటనకు ముందే అమరావతి ప్రాంతంలో పేదలను మభ్యపెట్టి, మోసం చేసి తన వాళ్ల చేత చంద్రబాబు భూములను కొనుగోలు చేయించారన్నారు.

దర్యాప్తుకు ముందు మాత్రం దమ్ముంటే దర్యాప్తు చేసుకోండి అన్నారని… ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంటే అన్యాయం అంటూ కోర్టుకు వెళ్తున్నారని విమర్శించారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ తీరుచూస్తుంటే వైసీపీ ప్రభుత్వ కేబినెట్‌లోనూ టీడీపీ నేతలనే మంత్రులుగా పెట్టాలని అన్నట్టుగా ఉందని విమర్శించారు. ఐదేళ్లు సీఎంగా ఉండి కనీసం కరకట్ట రోడ్డు కూడా వేయలేని అసమర్థుడు చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

తాను రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తిరిగి నెగ్గితే రాజధానిగా అమరావతినే కొనసాగిస్తారా… అలా జగన్‌మోహన్ రెడ్డి లిఖితపూర్వకంగా రాసిస్తారా అంటూ రఘురామకృష్ణంరాజు చేసిన కామెంట్స్‌కు బొత్స స్పందించారు. చాలెంజ్‌లు ఎందుకు ఒక సారి రాజీనామా చేసి ట్రై చేయి అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు సవాల్ చేశారని… ఆ సవాల్‌కు స్పందించాలన్నారు. చిన్నచిన్న మాటలకు తాము స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అమరావతి మీద రెఫరెండం కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడమను అంటూ బొత్స వ్యాఖ్యానించారు.

First Published:  12 Sep 2020 4:05 AM GMT
Next Story