ఎట్టకేలకు ఓటీటీలోకి బుజ్జిగాడు

నాని లాంటి హీరోనే గత్యంతరం లేక ఓటీటీ బాట పడితే.. రాజ్ తరుణ్ మాత్రం మొన్నటివరకు బెట్టు చేశాడు. ఇప్పుడు దారికొచ్చాడు. అతడు నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమా కూడా ఓటీటీ బాట పట్టింది. ఆహా యాప్ లో అక్టోబర్ 2న ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది.

ఈ డీలింగ్ గమ్మత్తుగా జరిగింది. ఈ సినిమా కోసం ఆహా-జీ తెలుగు సంస్థలు కలిశాయి. డిజిటల్ కోసం ఆహా సంస్థ రెండున్నర కోట్ల రూపాయలు వెచ్చిస్తే.. కోటిన్నరకు జీ తెలుగు ఛానెల్ శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది. ఇంతకుముందు భానుమతి అండ్ రామకృష్ణ సినిమా కోసం కూడా వీళ్లిద్దరూ ఇలానే కలిశారు.

మొత్తానికి క్రేజీ మూవీస్ అన్నీ ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ఓటీటీలోకి వస్తున్నాయి. నాని-సుధీర్ బాబు నటించిన “వి” సినిమా వచ్చేసింది. ఒరేయ్ బుజ్జిగా, నిశ్శబ్దం సినిమాలు డీల్స్ క్లోజ్ అయ్యాయి. త్వరలోనే మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లోకి రాబోతున్నాయి.