Telugu Global
National

డ్రగ్స్‌ కేసులో రకుల్‌, సైఫ్‌ కూతురి పేర్లు..!

బాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో కొత్తకొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి పోలీసుల విచారణలో అనేక మంది సినీ ప్రముఖుల పేర్లను వెల్లడించినట్టు టైమ్స్ నౌ కథనాన్ని ప్రచురించింది. రియా చెప్పిన పేర్లలో హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్‌ పేరు ఉందని వెల్లడించింది. రకుల్‌తో పాటు సైప్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, హీరో రణ్‌వీర్ సింగ్‌కు సన్నిహితురాలైన సైమోన్‌ ఖంబట్టా తదితరుల పేర్లు ఉన్నట్టు టైమ్స్ […]

డ్రగ్స్‌ కేసులో రకుల్‌, సైఫ్‌ కూతురి పేర్లు..!
X

బాలీవుడ్ డ్రగ్స్‌ కేసులో కొత్తకొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి పోలీసుల విచారణలో అనేక మంది సినీ ప్రముఖుల పేర్లను వెల్లడించినట్టు టైమ్స్ నౌ కథనాన్ని ప్రచురించింది.

రియా చెప్పిన పేర్లలో హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్‌ పేరు ఉందని వెల్లడించింది. రకుల్‌తో పాటు సైప్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, హీరో రణ్‌వీర్ సింగ్‌కు సన్నిహితురాలైన సైమోన్‌ ఖంబట్టా తదితరుల పేర్లు ఉన్నట్టు టైమ్స్ నౌ ప్రచురించింది.

డ్రగ్స్‌కు బానిసలైన 25 మంది బాలీవుడ్ అగ్రశ్రేణి నటీనటులు, టెక్నీషియన్ల పేర్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వద్ద ఉన్నట్టు వివరించింది.

First Published:  11 Sep 2020 8:57 PM GMT
Next Story