పూజా హెగ్డే ల్యాండ్ అయింది….

దాదాపు 5 నెలల గ్యాప్ తర్వాత పూజా హెగ్డే హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ కు దూరమైన ఈ బ్యూటీ ఎట్టకేలకు సెట్స్ పైకి రాబోతోంది. త్వరలోనే ప్రారంభంకానున్న రాధేశ్యామ్ షూటింగ్ లో జాయిన్ అవుతుంది పూజా హెగ్డే.

ప్రభాస్ తో చేస్తున్న రాధేశ్యామ్ తో పాటు అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేస్తోంది పూజ. ఈ సినిమా షెడ్యూల్ ను కూడా ఆమె ఈ నెలలోనే ప్రారంభించబోతోంది. ఈ రెండు సినిమాలు పూర్తయితే తప్ప, ఆమె తన కొత్త సినిమాలకు డేట్స్ కేటాయించే పరిస్థితి లేదు.

అందుకే ఓవైపు కరోనా భయాలు ఉన్నప్పటికీ సెట్స్ పైకి వచ్చేస్తోంది పూజా హెగ్డే. ఈరోజు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు విమానంలో వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా విమానాశ్రయంలో దిగిన ఫొటోను తన సోషల్ మీడియా వాల్ పై పోస్ట్ చేసింది.