ఆదిలాబాద్ లో అల్లు అర్జున్

హీరో అల్లు అర్జున్ ఆదిలాబాద్ లో సందడి చేశాడు. కుటుంబంతో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించాడు. బన్నీతో పాటు పుష్ప సినిమా యూనిట్ సభ్యులు కూడా ఉన్నారు. జలపాతం వద్ద సినిమాల షూటింగ్ కు అనువైన ప్రదేశాలను గుర్తించారు. అనంతరం ఆదిలాబాద్‌ పట్టణ శివారులోని మావల హరితవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్మృతివనంలో ఎర్రచందనం మొక్కను నాటాడు బన్నీ. ఆదిలాబాద్ అటవీ అందాలు మరువలేనివని అన్నాడు.

అంతా బాగానే ఉంది కానీ బన్నీ చేసిన ఈ పర్యటన అతడ్ని వివాదాల్లోకి లాగింది. కరోనా నేపథ్యంలో సందర్శనీయ ప్రదేశాలకు ఎవ్వర్నీ అనుమతించడం లేదు అధికారులు. అలాంటిది బన్నీ వస్తున్నాడనగానే ఎర్రతివాచీ పరిచారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సెలబ్రిటీలకు ఒక రూలు, సామాన్యులకు మరో రూల్ ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఈ ఏడాది ఇప్పటివరకు సెట్స్ పైకి రాలేదు బన్నీ. అతడు చేయాల్సిన పుష్ప సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదాపడుతూ వస్తోంది. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. కానీ బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు.

View this post on Instagram

#alluarjunonline #alluarjun #stylishstar #alluarjunarmy

A post shared by Allu chandu (@alluchanduonline) on