అనుష్కకు అండగా మారుతి

సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కామన్. హీరోలైనా, హీరోయిన్లయినా, చివరికి దర్శకులైనా ఏదో ఒక సందర్భంలో ట్రోలింగ్ కు గురి కావాల్సిందే. ఎంత వివాదరహితంగా ఉందామని ట్రై చేసినా ఏదో ఒక విమర్శ కాచుకోవాల్సి వస్తుంది. హీరోయిన్ అనుష్క శర్మకు కూడా అదే పరిస్థితి ఎదురైంది.

తను గర్భవతిగా ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది అనుష్క శర్మ. ఈ ఫీలింగ్ చాలా ఆనందంగా ఉందని ఏదో రాసుకొచ్చింది. అయితే నెటిజన్లు మాత్రం రివర్స్ అయ్యారు. ఇలా గర్భాన్ని చూపించడం ఫ్యాషన్ అయిపోయిందని కొందరు కామెంట్ చేస్తే… విరాట్ కోహ్లి నీకు గర్భం మాత్రమే ఇచ్చాడు, ఇంగ్లండ్ కు రాణిని చేయలేదంటూ మరికొందరు కాస్త అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారు.

వీటిపై దర్శకుడు మారుతి స్పందించాడు. అనుష్క శర్మకు అండగా నిలిచాడు. ఓ మహిళగా తన గర్భం చూపిస్తూ, ఆనందం వ్యక్తంచేసే హక్కు అనుష్క శర్మకు ఉందన్నాడు మారుతి. ఇంగ్లాండ్ రాణి హోదా కంటే తల్లి హోదా చాలా గొప్పదన్నాడు. ఈ దర్శకుడి స్పందనకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.