అదరగొట్టిన నారా రోహిత్

కొన్నాళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంటున్నాడు హీరో నారా రోహిత్. ఆటగాళ్లు, వీరభోగవసంతరాయలు సినిమా తర్వాత కావాలనే గ్యాప్ తీసుకున్నాడు. ఎన్ని ఆఫర్లు వచ్చినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

అలా కెమెరాకు గ్యాప్ ఇచ్చిన రోహిత్, ఇప్పుడు పూర్తి ఫిట్ గా తయారయ్యాడు. బొద్దు పర్సనాలిటీ నుంచి ఫిట్ షేప్ కు వచ్చేశాడు. అంతేకాదు.. లేటెస్ట్ గా గడ్డం కూడా పెంచి ట్రెండీగా ముస్తాబయ్యాడు. ఈ లుక్ తో ఇతడి మేకోవర్ కంప్లీట్ అయినట్టుంది.

సో.. త్వరలోనే ఈ హీరో తన కొత్త సినిమా ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు. లెక్కప్రకారం ఈపాటికే సినిమా ఎనౌన్స్ చేసేవాడు. కానీ కరోనా/లాక్ డౌన్ కారణంగా ఇంకాస్త గ్యాప్ తీసుకొని కొత్త సినిమా ఎనౌన్స్ చేయబోతున్నాడు. అన్నట్టు అల్లు అర్జున్ పుష్ప మూవీలో ఓ కీలక పాత్ర కోసం నారా రోహిత్ ను తీసుకుంటున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. దీనిపై ఈ హీరో ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో!