17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ముందస్తుగా ఎంపీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్ అని తేలింది.

వీరిలో 12 మంది బీజేపీ ఎంపీలున్నారు.

వైసీపీకి చెందిన ఎంపీలు రెడ్డప్ప, మాధవి కూడా కరోనా బారినపడ్డారు. శివసేన, డీఎంకే, ఆర్‌ఎల్పీకి చెందిన ఒక్కో ఎంపీకి కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది.

వారిని ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచనలు చేశారు.