ఆ దర్శకుడు బ్లూ ఫిలిం చూపించాడు…

మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారింది హీరోయిన్ పాయల్ ఘోష్. తెలుగులో ఎన్టీఆర్ సరసన ఊసరవెల్లి సినిమా చేసిన ఈ బెంగాలీ బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ పై డ్రగ్స్ ఆరోపణలు, కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. తన కెరీర్ స్టార్టింగ్ లో ఓ బాలీవుడ్ దర్శకుడు.. తన ప్రమేయం లేకుండా తనకు నీలిచిత్రాలు చూపించాడని షాకింగ్ ప్రకటన చేసింది ఈ బ్యూటీ.

“ముంబయిలోని ఈఆర్డీ రోడ్డులో అప్పట్లో ఆ దర్శకుడు ఉండేవాడు. నన్ను 2 రోజులు బాగానే చూసుకున్నాడు. మూడో రోజు మాత్రం వేరే గదిలోకి తీసుకెళ్లాడు. నా ప్రమేయం లేకుండా బ్లూ ఫిలిం చూపించసాగాడు. కాస్త ఇబ్బందిగా ఉందని, రేపు కలుస్తానని నేను అతడితో చెప్పాను. కానీ అతడు బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఫోన్ చేస్తే ఎంతోమంది హీరోయిన్లు తన గదికి వస్తారని, నువ్వెందుకు బెట్టు చేస్తున్నావంటూ నన్ను హెచ్చరించాడు.”

అయితే ఆ హెచ్చరికల్ని తను పట్టించుకోలేదని, ఆ తర్వాత మళ్లీ ఆ దర్శకుడి ఇంటికి వెళ్లలేదని చెప్పుకొచ్చింది పాయల్. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యపై స్పందిస్తూ.. సుశాంత్ తనకు బాగా తెలుసని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటోంది పాయల్. బాలీవుడ్ లో డ్రగ్స్ తీసుకునే నటీనటులు తనకు కూడా తెలుసంటోంది.