అసలు రకుల్ పేరు ఉందా లేదా?

సుశాంత్ మరణానికి సంబంధించి వెలుగులోకొచ్చిన డ్రగ్స్ కేసులో ఊహించని విధంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓ సెక్షన్ జాతీయ మీడియా రకుల్ పేరును ప్రముఖంగా వెల్లడించింది. మరోవైపు రకుల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందంటూ మరో మీడియా వార్తలు కూడా ఇచ్చేసింది.

అయితే ఇప్పుడీ వ్యవహారం ఈరోజు కొత్త మలుపు తీసుకుంది. మాదకద్రవ్యాల నిరోధక శాఖ (ఎన్సీబీ) అదుపులో ఉన్న రియా… రకుల్, సారాతో పాటు మరో పాతిక మంది పేర్లు చెప్పినట్టు కథనాలు వచ్చాయి. వాటిని ఈరోజు ఉదయం ఎన్సీబీ ఖండించింది. అలాంటి పేర్లు చర్చలోకి రాలేదని, అన్నీ ఊహాగానాలనీ కొట్టిపారేసింది.

అయితే ఈ ప్రకటన వచ్చిన కొన్ని గంటలకే ఎన్సీబీ నుంచి మరో ప్రకటన వచ్చింది. కొంతమంది బాలీవుడ్ నటీనటులకు సమన్లు జారీ చేయాలని అనుకుంటున్నట్టు తెలిపింది. దీంతో అసలు రకుల్ పేరు లిస్ట్ లో ఉందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం సాయంత్రానికి ఈ మేటర్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.