Telugu Global
National

హైకోర్టు స్టేను కొట్టివేసిన సుప్రీం కోర్టు

సుప్రీంకోర్టులో రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యానికి చుక్కెదురైంది. స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంలో 10 మంది చనిపోయిన కేసులో దర్యాప్తు జరపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తుపై హైకోర్టు ఇచ్చిన స్టేను కొట్టివేసింది. స్వర్ణప్యాలెస్ ఘటనలో ఏపీ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే ఆస్పత్రి యాజమాన్యం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దర్యాప్తును నిలివేయాలని కోరారు. ఇందుకు స్పందించిన హైకోర్టు ఏపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోకుండా ఆస్పత్రిపై మాత్రమే ఎందుకు చర్యలు అని […]

హైకోర్టు స్టేను కొట్టివేసిన సుప్రీం కోర్టు
X

సుప్రీంకోర్టులో రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యానికి చుక్కెదురైంది. స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంలో 10 మంది చనిపోయిన కేసులో దర్యాప్తు జరపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తుపై హైకోర్టు ఇచ్చిన స్టేను కొట్టివేసింది.

స్వర్ణప్యాలెస్ ఘటనలో ఏపీ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తుండగానే ఆస్పత్రి యాజమాన్యం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది.

దర్యాప్తును నిలివేయాలని కోరారు. ఇందుకు స్పందించిన హైకోర్టు ఏపీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోకుండా ఆస్పత్రిపై మాత్రమే ఎందుకు చర్యలు అని మండిపడింది. అధికారులను నిందితులుగా చేర్చే వరకు కేసులో ముందుకు వెళ్లడానికి వీల్లేదని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.

హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. రమేష్ ఆస్పత్రి కేసులో దర్యాప్తుకు అనుమతి ఇచ్చింది. పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని డాక్టర్ రమేష్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో రమేష్‌ ఆస్పత్రిపై కేసు విచారణ మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు సహకరించాలని ఆదేశించిన నేపథ్యంలో డాక్టర్ రమేష్‌ పోలీసుల ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

First Published:  14 Sep 2020 5:16 AM GMT
Next Story