లేడీ కమెడియన్ పెళ్లి కబుర్లు

కొన్ని రోజుల కిందట నిశ్చితార్థం చేసుంది లేడీ కమెడియన్ విద్యుల్లేఖ. ఎట్టకేలకు తన ప్రేమ-పెళ్లి విషయాల్ని బయటపెట్టింది. తన కాబోయే భర్త గురించి, చేసుకోబోయే పెళ్లి గురించి వివరించింది.

విద్యు కాబోయే భర్త పేరు సంజయ్. అతడు సింధి తెగకు చెందిన వాడట. ఉత్తరాంధ్ర వాసి. అందుకే అతడికి తెలుగు సినిమాల గురించి తెలియదంట. పరిచయం అయిన తర్వాత, స్వయంగా చెబితే తప్ప అతడికి విద్యుల్లేఖ ఓ నటి అనే విషయం తెలియదట.

ఇక ప్రేమ విషయానికొస్తే.. గతేడాదే విద్యు-సంజయ్ ప్రేమలో పడ్డారు. ముందుగా సంజయే, విద్యుకు ఐ లవ్ యు చెప్పాడట. అంతేకాదు.. ఈ ఏడాది నిశ్చితార్థం చేసుకోవాలని, వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలని 2019లోనే అనుకుందట ఈ జంట. ఇలా తన ప్రేమ-పెళ్లికి సంబంధించిన వివరాల్ని బయటపెట్టింది ఈ హాస్యనటి.