విశాఖలో దిగ్గజ కంపెనీ పెట్టుబడి

విశాఖకు మరో భారీ పెట్టుబడి రాబోతోంది. జపాన్‌కు చెందిన యోకొహమా గ్రూప్‌కు చెందిన అలయన్స్ టైర్‌ కంపెనీ విశాఖలో టైర్ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. 1240 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్‌ను నిర్మిస్తారు.

2023 ప్రారంభంలో ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ఈ కంపెనీకి భారత్‌లో ఇప్పటికే గుజరాత్, తమిళనాడులో రెండు ప్లాంట్లు ఉన్నాయి.

అచ్చుతాపురం పారిశ్రామిక పార్కులోని స్పెషల్ ప్రాజెక్టుల జోన్‌లో ఈ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల రకాల టైర్లను తయారు చేసి విక్రయిస్తోంది.