నన్ను అరెస్ట్ చేయవద్దని చెప్పండి – హైకోర్టులో మాజీ ఏజీ దమ్మాలపాటి

అమరావతి భూకుంభకోణంపై దర్యాప్తు చేయించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో టీడీపీ హయాంలో అడ్వకేట్ జనరల్‌గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించారు.

కుంభకోణంలో తనను అరెస్ట్ చేయకుండా, కఠిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషన్‌ వేశారు. తనకు వ్యతిరేకంగా జరిగే దర్యాప్తు హైకోర్టు పర్యవేక్షణలోనే జరిపించాలని, హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా మరో దర్యాప్తుకు ఆదేశించకుండా చూడాలని కోర్టును కోరారు.

తనను మానసికంగా వేధించినందుకు, బెదిరించినందుకు తగిన పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

గతంలో ఏజీ పదవిని అడ్డంపెట్టుకుని అక్రమార్జన చేశానంటూ ఊహల ఆధారంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దమ్మాలపాటి చెప్పారు. ఈ పిటిషన్‌ను మంగళవారం కోర్టు విచారించనుంది.