లీక్ అవుతున్న లవ్ స్టోరీ

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలకు లీకేజీ బెడద అనేది సర్వసాధారణం అయిపోయింది. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఆచార్య, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల స్టిల్స్ కూడా నెట్ లో ప్రత్యక్షమైపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు సంబంధించి కొన్ని రోజుల కిందట ఏకంగా ఎన్టీఆర్ వీడియోనే లీక్ అయింది. ఇప్పుడు లవ్ స్టోరీ వంతు వచ్చింది.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఈమధ్యనే సెట్స్ పైకి వచ్చింది. ఇలా సెట్స్ పైకి వచ్చిందో లేదో అలా లీకులు మొదలయ్యాయి. హైదరాబాద్ లో ప్రారంభమైన షెడ్యూల్ కు సంబంధించిన ఫొటోలు నెట్ లోకి వచ్చేశాయి. తాజాగా గండికోటలో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏకంగా వీడియోలే ప్రత్యక్షమైపోయాయి.

లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి ఇది ఆఖరి షెడ్యూల్. మరో వారం రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయమని, థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని ఇప్పటికే యూనిట్ క్లారిటీ ఇచ్చింది.