ప్రభాస్ టీజర్ పని మొదలైంది

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమా రాధేశ్యామ్. కొన్నాళ్లు సాహో కారణంగా, ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది. రేపోమాపో సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో పెద్ద న్యూస్ రెడీ అయింది.

అవును.. రాధేశ్యామ్ మూవీకి సంబంధించి ఇవాళ్టి నుంచి టీజర్ ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ అయింది. వచ్చేనెలలో ప్రభాస్ పుట్టినరోజు ఉంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ చేయాలనేది యూవీ క్రియేషన్స్ నిర్మాతల ప్లాన్. అందుకోసం ఇప్పట్నుంచే పని ప్రారంభించారు. నిజంగా ప్రభాస్ అభిమానులకు ఇది గుడ్ న్యూసే.

రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు ఇంకా మ్యూజిక్ డైరక్టర్ ను ఫిక్స్ చేయలేదు.