ఓటీటీలపై యంగ్ హీరో ఆసక్తి

ఓవైపు ఓటీటీ లు ఓ రేంజ్ లో చొచ్చుకొస్తుంటే.. మరోవైపు హీరోలు మాత్రం వాటిపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సినిమాలు, మూవీ బిజినెస్ పైనే వాళ్లు దృష్టి పెడుతున్నారు. అయితే హీరో రాజ్ తరుణ్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించాడు. అవకాశం వస్తే ఓటీటీల్లో కూడా నటిస్తానంటున్నాడు ఈ హీరో.

సినిమాల కంటే ఓటీటీల్లో ప్రయోగాలు చేయడానికి ఎక్కువ అవకాశం దొరుకుతుందంటున్న ఈ హీరో.. సినిమాల్లో చేసే పాత్రల్లాంటివి మాత్రం ఓటీటీలో చేయనంటున్నాడు. కాస్త కొత్తగా, ఆసక్తి కలిగించే పాత్రలు మాత్రమే చేస్తానంటున్నాడు.

మరోవైపు పెళ్లిపై కూడా స్పందించాడు ఈ హీరో. మరో రెండేళ్లలో పెళ్లి చేసుకుంటానంటున్న రాజ్ తరుణ్.. తన ఫ్రెండ్ నిఖిల్ వైవాహిక జీవితం ఎలా ఉందో చూసి, అప్పుడు పెళ్లిపై ఓ నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నాడు.