బాలయ్య సినిమాలో అల్లరోడు

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ ఉందని, ఆ పాత్రను ఓ యంగ్ హీరోతో చేయిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఆ పాత్రకు నవీన్ పొలిశెట్టి, నవీన్ చంద్ర లాంటి పేర్లు వినిపించగా తాజాగా అల్లరి నరేష్ పేరు వార్తల్లోకెక్కింది.

పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో స్పెషల్ రోల్ ను అల్లరోడితో చేయించాలని భావిస్తున్నాడట బోయపాటి. మొన్నీ మధ్య మహేష్ హీరోగా నటించిన మహర్షి లో నరేష్ చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు బోయపాటి తన సినిమాలో క్యారెక్టర్ కి అల్లరి నరేష్ ని ఫిక్స్ అయ్యాడట.

ఇటీవలే నరేష్ ను కలిసి క్యారెక్టర్ తో పాటు స్క్రిప్ట్ కూడా చెప్పాడని సమాచారం. ప్రస్తుతం హీరోగా నాంది సినిమా చేస్తున్నాడు నరేష్. మరి ప్రచారం జరుగుతున్నట్లు బాలయ్య-బోయపాటి సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపిస్తాడా లేదా అనేది నరేష్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.