Telugu Global
National

న్యాయమూర్తి కుటుంబసభ్యులున్నారు కాబట్టే హైకోర్టు ఉత్తర్వులు " మిథున్ రెడ్డి

లోక్‌సభలో రాజధాని భూకుంభకోణాన్ని మిథున్ రెడ్డి లేవనెత్తారు. రాజధాని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. 4వేల ఎకరాలను ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో చేజిక్కించుకున్నారని వివరించారు. వేల కోట్ల విలువైన భూములను కుట్రలు చేసి లక్షల రూపాయలకే సొంతం చేసుకున్నారని మిథున్ రెడ్డి లోక్‌సభలో చెప్పారు. తొలుత కృష్ణా జిల్లా తిరువూరులో రాజధాని అని చంద్రబాబు చెప్పారని… అలా చెప్పి ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని […]

న్యాయమూర్తి కుటుంబసభ్యులున్నారు కాబట్టే హైకోర్టు ఉత్తర్వులు  మిథున్ రెడ్డి
X

లోక్‌సభలో రాజధాని భూకుంభకోణాన్ని మిథున్ రెడ్డి లేవనెత్తారు. రాజధాని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. 4వేల ఎకరాలను ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో చేజిక్కించుకున్నారని వివరించారు. వేల కోట్ల విలువైన భూములను కుట్రలు చేసి లక్షల రూపాయలకే సొంతం చేసుకున్నారని మిథున్ రెడ్డి లోక్‌సభలో చెప్పారు.

తొలుత కృష్ణా జిల్లా తిరువూరులో రాజధాని అని చంద్రబాబు చెప్పారని… అలా చెప్పి ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. టీడీపీ నేతలు మాత్రం అసలైన రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని… కానీ నిష్పాక్షికంగా విచారణ జరగాలంటున్నారు కాబట్టే సీబీఐకి అప్పగించాల్సిందిగా కోరుతున్నామన్నారు.

ఎఫ్‌ఐఆర్‌ను రహస్యంగా ఉంచాలంటూ హైకోర్టు ఆదేశించిన అంశాన్ని కూడా మిథున్ రెడ్డి ప్రస్తావించారు. మీడియా, సోషల్ మీడియాలో ఎఫ్‌ఐఆర్‌ గురించి రాయవద్దంటూ హైకోర్టు చెప్పిందని… మాజీ అడ్వకేట్ జనరల్‌తో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కుటుంబసభ్యుల పేర్లు ఉండడం వల్లే ఈ తరహా ఆదేశాలు ఇచ్చారని లోక్‌సభలో మిథున్ రెడ్డి చెప్పారు.

ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఒకే న్యాయం ఉండాలన్నారు. అమరావతి కుంభకోణం తరహాలోనే ఫైబర్‌ గ్రిడ్ కుంభకోణం కూడా జరిగిందని వివరించారు. ఫైబర్‌ గ్రిడ్‌లో 2వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు ఆధారాలున్నాయన్నారు. ఫైబర్ గ్రిడ్‌పైనా సీబీఐ విచారణ జరిపించాలన్నారు.

First Published:  16 Sep 2020 7:51 AM GMT
Next Story