సాహో వచ్చేస్తున్నాడోచ్….

సాహో సినిమా గుర్తుందా.. ప్రభాస్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమా రావడం, ఫ్లాప్ అయిపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ప్రభాస్ తో పాటు అతడి అభిమానులు ఈ సినిమాను మరిచిపోయే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఓ చిన్న విషయాన్ని ఫ్యాన్స్ మిస్సయ్యారు.

సాహో సినిమా ఇప్పటివరకు టీవీల్లోకి రాలేదు. ఎట్టకేలకు ఆ ముహూర్తం ఫిక్స్ అయింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరాకు ఈ సినిమా టీవీల్లో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. కొన్ని నెలల కిందట ఈ సినిమా హక్కుల్ని జీ తెలుగు ఛానెల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అలా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జీ తెలుగు, దసరాకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా సినిమాను ప్రసారం చేయబోతోంది.

ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఈ సినిమా. అయితే టాలీవుడ్ లో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అటు బాలీవుడ్ లో మాత్రం హిట్టయింది. వంద కోట్ల క్లబ్ లో కూడా చేరింది.