Telugu Global
Cinema & Entertainment

అల్లు అర్జున్ పై పోలీస్ కేసు?

సరదాగా ఆదిలాబాద్ వెళ్లి కుంటాల జలపాతం చూసొచ్చాడు బన్నీ. అతడితో పాటు అతడి కుటుంబ సభ్యులు, పుష్ప సినిమా యూనిట్ కూడా ఉందని టాక్. విహార యాత్ర బాగానే జరిగింది. జనాలు, సెల్ఫీలు, బన్నీ పోజులు, లేటెస్ట్ హెయిర్ కట్స్, మీమ్స్.. అబ్బో చాలా యవ్వారం నడిచింది. అంతా బాగా జరిగింది. పబ్లిసిటీ పీక్స్ లో వచ్చినందుకు బన్నీ కూడా హ్యాపీ. ఆ మరుసటి రోజు మొదలైన అసలు రచ్చ. లాక్ డౌన్ అంటూ సందర్శనీయ స్థలాల్లోకి […]

అల్లు అర్జున్ పై పోలీస్ కేసు?
X

సరదాగా ఆదిలాబాద్ వెళ్లి కుంటాల జలపాతం చూసొచ్చాడు బన్నీ. అతడితో పాటు అతడి కుటుంబ సభ్యులు, పుష్ప సినిమా యూనిట్ కూడా ఉందని టాక్. విహార యాత్ర బాగానే జరిగింది. జనాలు, సెల్ఫీలు, బన్నీ పోజులు, లేటెస్ట్ హెయిర్ కట్స్, మీమ్స్.. అబ్బో చాలా యవ్వారం నడిచింది. అంతా బాగా జరిగింది. పబ్లిసిటీ పీక్స్ లో వచ్చినందుకు బన్నీ కూడా హ్యాపీ. ఆ మరుసటి రోజు మొదలైన అసలు రచ్చ.

లాక్ డౌన్ అంటూ సందర్శనీయ స్థలాల్లోకి సామాన్యుల్ని రాకుండా చేసిన పోలీసులు.. బన్నీ వచ్చేసరికి జలపాతం చుట్టూ ఎర్రతివాచీ పరిచి మరీ చూపించారంటూ విమర్శలు మొదలయ్యాయి. ఇలా విమర్శలతో ఆగిపోతే ఏ నష్టం ఉండేది కాదు. బన్నీ ఫేస్ చేసిన ఎన్నో విమర్శల్లో ఇది కూడా ఒకటిగా కొట్టుకుపోయేది.

కానీ సమాచార హక్కు సాధనా స్రవంతి ప్రతినిథులు బన్నీపై, పలువురు అధికారులపై కేసు వేశారు. లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు అంతమంది గుమిగూడ్డానికి బన్నీనే కారణమని ఈ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి జలపాతాన్ని సందర్శించారని, తిప్పేశ్వర్ లో షూటింగ్ కూడా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రస్తుతానికైతే ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఎంక్వయిరీ చేస్తాం అన్నారు. కేసు నమోదు చేస్తారా, రాజీ కుదుర్చుతారా అనేది చూడాలి. సెలబ్రిటీల కేసులన్నీ ఎక్కువగా రాజీలతోనే పరిష్కృతమౌతాయి. కాకపోతే ఈ కేసు డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం కిందకు వస్తుంది. ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

First Published:  17 Sep 2020 10:10 AM GMT
Next Story