Telugu Global
Health & Life Style

తులసి ఆకులను... నమలకూడదా? !

తులసి ఆకుల్లో చాలా చక్కని ఔషధ గుణాలు ఉన్న సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో తులసి తోడ్పడుతుంది. ఉదయాన్నే రెండు మూడు తులసి ఆకులను నమిలి మింగితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది నమ్ముతుంటారు. అయితే తులసి ఆకులు ఆరోగ్యానికి మంచివే కానీ… వాటిని అలా నేరుగా పచ్చి ఆకులను నమలకూడదంటున్నారు ఢిల్లీకి చెందిన లవ్ నీత్ బాత్రా అనే పోషకాహార నిపుణురాలు. తులసి […]

తులసి ఆకులను... నమలకూడదా? !
X

తులసి ఆకుల్లో చాలా చక్కని ఔషధ గుణాలు ఉన్న సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. దగ్గు, గొంతు నొప్పి లాంటి సమస్యలను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో తులసి తోడ్పడుతుంది. ఉదయాన్నే రెండు మూడు తులసి ఆకులను నమిలి మింగితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది నమ్ముతుంటారు.

అయితే తులసి ఆకులు ఆరోగ్యానికి మంచివే కానీ… వాటిని అలా నేరుగా పచ్చి ఆకులను నమలకూడదంటున్నారు ఢిల్లీకి చెందిన లవ్ నీత్ బాత్రా అనే పోషకాహార నిపుణురాలు. తులసి ఆకుల్లో పాదరసం ఉంటుందని అది మన పళ్ల ఎనామిల్ కి హాని చేస్తుందని అంటున్నారామె.

అవును తులసి ఆకుల్లో పాదరసం ఉంటుందట. ఆకులను నమిలినప్పుడు అది మన దంతాలకు అంటుకుని దంతాలకు హాని చేస్తుంది… దంతాల రంగు మారడానికి కారణం అవుతుంది. తులసిలో కొంచెం ఆమ్లతత్వం ఉండటం, మన నోరు క్షార తత్వంతో ఉండటం వలన… ఈ రెండు కలవటం కారణంగా కూడా దంతాలకు హాని కలుగుతుందట.

అందుకే తులసి ఆకులను నేరుగా కాకుండా… ఇతర పద్ధతుల ద్వారా తీసుకోవచ్చు.

  • తులసి ఆకులను నీళ్లలో వేసి మరిగించి తేనె నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు. ఈ టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • తులసి ఆకులను ఆరనిచ్చి వాటిని పొడి చేసుకుని నేతిలో కలుపుకుని తీసుకోవచ్చు. రెండు టీస్పూన్ల నెయ్యికి అర టీస్పూను తులసి పొడిని కలుపుకుని చపాతి వంటివాటితో కలిపితినవచ్చు.
  • తులసి ఆకులతో జ్యూస్ కూడా తయారుచేసుకోవచ్చు. అరకప్పు నీటిలో పదినుండి పదిహేను వరకు తులసి ఆకులు వేసుకుని జ్యూస్ తయారుచేసుకోవాలి. ఇందులో తేనె నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు.
First Published:  16 Sep 2020 8:02 PM GMT
Next Story