Telugu Global
National

ఈవోకు చెప్పి లోకేష్‌ కోసం భువనేశ్వరే క్షుద్ర పూజలు చేయించారు " సోమినాయుడు

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ చైర్మన్ సోమినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెండి రథానికి ఉన్న మూడు సింహాలు కనిపించకపోవడంతో మీడియా ముందుకొచ్చిన ఆయన కీలక విషయాలు చెప్పారు. సింహాలు స్టోర్ట్‌రూమ్‌లో ఉన్నాయో లేవో అని గుడి తాలూకా అధికారులు అందరూ తనిఖీ చేసినట్లు వెల్లడించారు. అయితే ఆ సింహాలు స్టోర్‌‌రూమ్‌లో లేవన్నారు. కొత్త సింహాల ఏర్పాటు పనిని మొదలుపెట్టినట్టు చెప్పారు. ఈ రథాన్ని టీడీపీ హయాంలో ఆఖరి సారిగా ఉపయోగించారని.. అప్పటి నుంచి ముసుగు కప్పే […]

ఈవోకు చెప్పి  లోకేష్‌ కోసం భువనేశ్వరే  క్షుద్ర పూజలు చేయించారు  సోమినాయుడు
X

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయ చైర్మన్ సోమినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వెండి రథానికి ఉన్న మూడు సింహాలు కనిపించకపోవడంతో మీడియా ముందుకొచ్చిన ఆయన కీలక విషయాలు చెప్పారు.

సింహాలు స్టోర్ట్‌రూమ్‌లో ఉన్నాయో లేవో అని గుడి తాలూకా అధికారులు అందరూ తనిఖీ చేసినట్లు వెల్లడించారు. అయితే ఆ సింహాలు స్టోర్‌‌రూమ్‌లో లేవన్నారు. కొత్త సింహాల ఏర్పాటు పనిని మొదలుపెట్టినట్టు చెప్పారు.

ఈ రథాన్ని టీడీపీ హయాంలో ఆఖరి సారిగా ఉపయోగించారని.. అప్పటి నుంచి ముసుగు కప్పే ఉందన్నారు. సింహాల బొమ్మలు టీడీపీ హయంలోనే మాయం అయి ఉండవచ్చన్నారు. టీడీపీ హయాంలో ఘాట్ రోడ్డులో ఉన్న రథాన్ని తెచ్చి జమ్మిదొడ్డిలో పెట్టారన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇప్పటి వరకు ఉపయోగించలేదన్నారు. ఇటీవల తనిఖీల్లో భాగంగా పరిశీలన చేసినప్పుడు సింహాల బొమ్మలు లేకపోవడం బయటపడిందన్నారు.

వ్యవహారశైలి చూస్తుంటే టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇంట్లోనే ఈ బొమ్మలు ఉండవచ్చని సోమినాయుడు అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనూ నారా లోకేష్‌ కోసం నారా భువనేశ్వరి అప్పటి ఈవోతో మాట్లాడి అర్థరాత్రి క్షుద్రపూజలు చేయించారని సోమినాయుడు చెప్పారు.

నారా లోకేష్‌ను సీఎం చేసేందుకు అదనపు శక్తుల కోసం అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేశారన్న ఆరోపణలు టీడీపీ హయాంలో బలంగా వచ్చాయి. ముగ్గురు వ్యక్తులు అర్థరాత్రి అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన సీసీ ఫుటేజ్‌ కూడా బయటకు వచ్చింది. విచారణలో ముగ్గురు ఆలయంలో బైరవీ పూజలు నిర్వహించినట్టు అంగీకరించారన్న సమాచారం కూడా అప్పట్లో బయటకు వచ్చింది. కానీ ఆ తర్వాత దర్యాప్తు ముందుకు వెళ్లలేదు, వివరాలు బయటకు రానివ్వలేదు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దగ్గరుండి ఈ పూజలు చేయించారన్న ప్రచారం కూడా జరిగింది.

First Published:  17 Sep 2020 9:45 AM GMT
Next Story