Telugu Global
National

ఒక విధానం ప్రకారమే అమరావతిలో జడ్జిలకు భూములిచ్చాం " చంద్రబాబు

అమరావతి ప్రాంతంలో హైకోర్టు న్యాయమూర్తులకు భూములు కేటాయించడాన్ని చంద్రబాబు సమర్ధించుకున్నారు. ఒక విధానం ప్రకారమే ఆ పనిచేశామని వివరించారు. కొత్త రాజధానిలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటే వేగంగా అక్కడ అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతోనే ఐఏఎస్‌లకు, న్యాయమూర్తులకు స్థలాలు కేటాయించామని చెప్పారు. ఇదంతా ఒక విధానం ప్రకారమే చేశామని… దీనిపైనా అధికారపక్షం దుష్ర్పచారం చేస్తోందని చంద్రబాబు ఆగ్రహంవ్యక్తం చేశారు. 16నెలల వైసీపీ పాలనపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజ్యసభలో కరోనా గురించి మాట్లాడకుండా న్యాయవ్యవస్థ […]

ఒక విధానం ప్రకారమే అమరావతిలో జడ్జిలకు భూములిచ్చాం  చంద్రబాబు
X

అమరావతి ప్రాంతంలో హైకోర్టు న్యాయమూర్తులకు భూములు కేటాయించడాన్ని చంద్రబాబు సమర్ధించుకున్నారు. ఒక విధానం ప్రకారమే ఆ పనిచేశామని వివరించారు.

కొత్త రాజధానిలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటే వేగంగా అక్కడ అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతోనే ఐఏఎస్‌లకు, న్యాయమూర్తులకు స్థలాలు కేటాయించామని చెప్పారు. ఇదంతా ఒక విధానం ప్రకారమే చేశామని… దీనిపైనా అధికారపక్షం దుష్ర్పచారం చేస్తోందని చంద్రబాబు ఆగ్రహంవ్యక్తం చేశారు.

16నెలల వైసీపీ పాలనపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజ్యసభలో కరోనా గురించి మాట్లాడకుండా న్యాయవ్యవస్థ గురించి మాట్లాడడం ఏమిటని వైసీపీని చంద్రబాబు ప్రశ్నించారు.

జీఎస్‌టీ నిధుల కోసం కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ధర్నా చేస్తుంటే అందులో వైసీపీ ఎందుకు పాల్గొనలేదని చంద్రబాబు నిలదీశారు.

అయితే ఎన్నికల వేళ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎలాంటి భూకేటాయింపులపై నిర్ణయం తీసుకునే అధికారం లేకపోయినా ఆఘమేఘాల మీద చంద్రబాబు ఈ భూకేటాయింపులు చేయడం వెనుక ఉద్దేశాలను ఇతర రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.

First Published:  17 Sep 2020 11:03 PM GMT
Next Story