త్రివిక్రమ్ చేతికి పవన్ సినిమా?

అటుఇటు తిరిగి ఓ రీమేక్ ప్రాజెక్టు పవన్ చేతికి వచ్చినట్టు తెలుస్తోంది. దీని వెనక త్రివిక్రమ్ హస్తం ఉన్నట్టు కూడా సమాచారం. ఈ రీమేక్ ప్రాజెక్టు పేరు అయ్యప్పనుమ్ కోసియమ్. బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్.

మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ సినిమా రైట్స్ ను లాక్ డౌన్ కంటే ముందే దక్కించుకుంది సితార సంస్థ. ముందుగా ఈ మల్టీస్టారర్ సినిమాను రవితేజ-రానా హీరోలుగా తీద్దాం అనుకున్నారు. రానా ఎప్పుడూ సిద్ధమే కానీ అటువైపు హీరో మాత్రం దొరకడం లేదు. రవితేజ తప్పుకున్న తర్వాత చాలామంది తెరపైకి వచ్చి తప్పుకున్నారు.

ఈ క్రమంలో ఈ రీమేక్ ప్రాజెక్టుపై త్రివిక్రమ్ ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. కుదిరితే పవన్ ను ఇందులో ఓ హీరోగా పెట్టి.. దర్శకత్వ బాధ్యతల్ని వేరే వ్యక్తికి అప్పగించే ఆలోచనలో ఉన్నాడు. అవసరమైతే తను మాటల రచయితగా వ్యవహరించడానికి సిద్ధం.

ప్రస్తుతానికి నడుస్తున్న టాక్స్ ఇవి. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.