Telugu Global
National

ప్రభుత్వాన్ని మీరే నడుపుకోండి " హైకోర్టులో ఏఏజీ అసంతృప్తి

మిషన్ బిల్డ్ ఏపీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టులో గట్టి వాదనలు జరిగాయి. మిషల్ బిల్డ్ ఏపీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ లన్నీ ఒకే అంశానికి సంబంధించినవని… ఇక్కడ సమస్య అది కాదు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎవరు నడపాలో తేలిస్తే సరిపోతుందని అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైకోర్టును వేదికగా చేసుకుని పిటిషన్లు, పిల్స్ వేస్తూ సంక్షేమ పథకాలను అడ్డుకున్న వారు పాలన చేస్తున్నారా? లేక ప్రజల చేత ఎన్నుకోబడ్డ వారు […]

ప్రభుత్వాన్ని మీరే నడుపుకోండి  హైకోర్టులో ఏఏజీ అసంతృప్తి
X

మిషన్ బిల్డ్ ఏపీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టులో గట్టి వాదనలు జరిగాయి. మిషల్ బిల్డ్ ఏపీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ లన్నీ ఒకే అంశానికి సంబంధించినవని… ఇక్కడ సమస్య అది కాదు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎవరు నడపాలో తేలిస్తే సరిపోతుందని అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

హైకోర్టును వేదికగా చేసుకుని పిటిషన్లు, పిల్స్ వేస్తూ సంక్షేమ పథకాలను అడ్డుకున్న వారు పాలన చేస్తున్నారా? లేక ప్రజల చేత ఎన్నుకోబడ్డ వారు పాలన చేస్తున్నారా? అన్నది తేలిస్తే సరిపోతుందని సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సుధాకర్ రెడ్డి తమ గురించే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారేమోనని అనుమానించిన న్యాయమూర్తులు… మీరు మమ్మల్ని ఉద్దేంచి మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. పాలన ప్రభుత్వం చేస్తోందా లేక కోర్టు చేస్తోందా అని మీరు ప్రశ్నిస్తున్నారా అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. తాను పిటిషనర్ల గురించే మాట్లాడుతున్నానని సుధాకర్‌ రెడ్డి సమాధానం ఇచ్చారు.

పిటిషన్ల తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ప్రభుత్వం భూములు విక్రయించడం సరికాదన్నారు. దాంతో మరోసారి జోక్యం చేసుకున్న అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి… ఇదంతా ఎందుకు ప్రభుత్వాన్ని మీరే నడపండి.. సరిపోతుంది అంటూ సెటైర్ వేశారు.

ప్రభుత్వ తరపున మరో న్యాయవాది కాసా జగన్‌మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ టీడీపీ హయాంలో ఇదే రాష్ట్రంలో భూములను ఇష్టానికి అమ్మేసినప్పుడు, పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసినప్పుడు వీరంతా ఏమయ్యారని ప్రశ్నించారు.

ఈ సమయంలో జోక్యం చేసుకున్న హైకోర్టు ఇతర అంశాలను ప్రస్తావించవద్దని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది.

First Published:  18 Sep 2020 9:43 PM GMT
Next Story