అఖిల్ మిడిల్ డ్రాప్….

హీరో అఖిల్ మిడిల్ డ్రాప్ అయ్యాడు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ సంక్రాంతి బరిలో నిలిచాడనుకుంటే అలాంటిదేం లేదని తేల్చేశాడు. అవును.. అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సంక్రాంతికి రావడం లేదు. ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా ప్రకటించాడు.

నిజానికి ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపారు. ఆమధ్య రిలీజ్ చేసిన పోస్టర్ లో వీలైతే సంక్రాంతికొస్తాం అంటూ ప్రకటన కూడా ఇచ్చారు. కానీ అదే నెలలో, అంటే జనవరిలోనే 21వ తేదీన తమ సినిమా థియేటర్లలోకి వస్తుందని అఖిల్ ప్రకటించాడు.

అఖిల్ ప్రకటనతో అక్కినేని అభిమానులు డీలా పడ్డారు. చక్కనైన సంక్రాంతి సీజన్ ను వదలేయడం ఏంటని తమ హీరోపై మండిపడుతున్నారు. పోనీ సినిమాను ఏమైనా సమ్మర్ కు వాయిదా వేశారా అంటే అది కూడా లేదు. సంక్రాంతి సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత థియేటర్లలోకి వస్తాడంట. ఇదేం విడ్డూరమో.