Telugu Global
National

97 వేల కోట్ల వ్యయంతో కొత్త నీటి ప్రాజెక్టులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ లను త్వరగా పూర్తిచేసి వృధాగా పోతున్న నీటిని ఓడిసి పట్టడానికి ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ మొదలుపెట్టిన జలయజ్ఞంను ఆయన తనయుడు.. […]

97 వేల కోట్ల వ్యయంతో కొత్త నీటి ప్రాజెక్టులు
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ లను త్వరగా పూర్తిచేసి వృధాగా పోతున్న నీటిని ఓడిసి పట్టడానికి ప్రణాళికలను రూపొందిస్తోంది.

ఇటీవలే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

వైఎస్ఆర్ మొదలుపెట్టిన జలయజ్ఞంను ఆయన తనయుడు.. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు. రాయలసీమ నీటి కష్టాలు తీర్చేందుకు భారీ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు. ఇదే కాదు.. రాష్ర్టంలో ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్ర, కోస్తా తీరంలోని సాగునీటి రంగానికి చెందిన ప్రాజెక్ట్ లు లక్ష్యం మేరకు త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళుతోంది. ఇందుకోసం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.

సీఎం జగన్ తన ఐదేళ్ల పాలనలోనే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ లు లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని సంకల్పించారు. తన హయాంలోనే వాటిని పూర్తిచేసి రైతులకు నీళ్లు ఇచ్చి ఓట్లు అడగాలని తద్వారా మరోసారి గెలుపుబావుటా ఎగురవేయాలని యోచిస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల కోసం మొత్తం ఐదేళ్లలో కనీసం 96,550 కోట్లు అయినా వ్యయం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో నిర్మాణంలో ఉన్న వాటిని 84,092 కోట్లు వ్యయం చేయాలి. అలాగే కొత్త ప్రాజెక్ట్ లు పూర్తి చేయడానికి 72,458 కోట్లు ఖర్చు చేయాలి. ఈ నిధులు సమీకరణకు అవసరమైన చర్యలను ప్రభుత్వం ఎస్పివిలు (స్సెషల్ పర్పస్ వెహికిల్) ఏర్పాటు చేస్తోంది.

ఏపీ జలప్రదాయినిగా పోలవరం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఏపీ సాగు, తాగునీటి కష్టాలు చాలా వరకు తీరుతాయి. అందుకే సీఎం జగన్ ప్రధానంగా పోలవరంను పూర్తి చేయడానికి సంకల్పించారు. పోలవరం వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో చురుగ్గా పనులు చేయిస్తున్నారు. మరోవైపు ఇతర ప్రాజెక్ట్ లపైన అదే విధంగా దృష్టి పెట్టారు.

ప్రధాన జలాశయ నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తుండడంతో గతంలో పనిచేసిన సంస్థను ప్రభుత్వం రద్దు చేసి మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) కు జగన్ ప్రభుత్వం పనులు అప్పగించిన సంగతి తెలిసిందే.

వరద సమయంలోనూ సాగుతున్న పనులు….

అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి దాకా మొత్తం ప్రాజెక్టులో 71.46 శాతం పనులు పూర్తి కాగా.. ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ కీలకమైనవి. స్పిల్ వే కాంక్రీట్, స్పిల్ వే ఛానెల్ లలో 2.80 లక్షల ఘనపు మీటర్ల పని ఆరు నెలల కాలంలో జరిగింది. ప్రస్తుతం గోదావరికి వరదలు ఉన్నప్పటికీ పనులు ఆగకుండా స్పిల్ వే కాంక్రీట్ బ్రిడ్జ్ పనులు చేస్తున్నారు. అదే సమయంలో జల విద్యుత్ ప్రాజెక్ట్ పనులను కొనసాగిస్తున్నారు.

ఇక అదే సమయంలో రాష్ర్టంలో గతంలో చేపట్టిన పనులను పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రకాల ప్రాధాన్యతలను నిర్ణయించినట్టు తెలిసింది. అందులో భాగంగా వచ్చే ఏడాది కొన్ని ప్రాజెక్ట్ లను వినియోగంలోకి తెచ్చేందుకు బడ్జెట్లు కేటాయించగా ఇతర ప్రాజెక్ట్ లను మూడు నుంచి నాలుగేళ్ళ సమయంలో పూర్తి చేయడానికి లక్షాలను నిర్దేశించారు.

వివిధ ప్రాజెక్టులకు వివిధ ఎస్పివిలు…

రాష్ట్రాన్ని ఇప్పుడు నిధుల కొరత వెంటాడుతోంది. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిధుల కొరత ప్రధాన అవరోధంగా ఉంది. దీనిని ఎదుర్కొనేందుకు ఎస్పివిలను ఏర్పాటు చేశారు. అందులో ఎస్పివి – 1 కింద రాయలసీమలో కరువు నివారణకు 39,980 కోట్లు ఐదేళ్ళలో ఖర్చు చేయనున్నారు. ఎస్పివి – 2 కింద ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్ట్ లు పూర్తిచేయడానికి ఐదేళ్ళ కాలంలో 8,787 కోట్లు ఖర్చు చేస్తారు. ఎస్సివి – 3 ద్వారా ఏపి రాష్ర్ట నీటి రక్షణ అభివృద్ధి కార్యక్రమం పేరుతో 12,702 కోట్లు ఐదేళ్ళ కాలంలో సమీకరించనున్నారు. ఎస్పివి – 4 పేరుతో పలనాడు ఖరువు నివారణ కార్యక్రమం ద్వారా ప్రధానంగా గోదావరి, కృష్ణా – పెన్నాల అనుసంధానం కోసం 7,636 కోట్లు ఐదేళ్ళ కాలంలో ఖర్చు చేస్తారు. ఎస్పివి-5 కార్యక్రమం క్రింద కృష్ణా – కొల్లేరు సెలినిటి మిటిగేషన్ కార్యక్రమం ద్వారా 3356 కోట్లు సమీకరిస్తారు. సాగునీటి ప్రాజెక్ట్ లకు నిధుల సమీకరణకు ఎస్పివిలు ఏర్పాటు చేయడం అరుదైనది కాగా, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టుదల వల్ల వ్యూహాత్మకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

ఈ డిసెంబర్ నాటికి ఉత్తరాంధ్రప్రాజెక్టు పూర్తి….

ఉత్తరాంధ్రలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వంశధార–నాగావళి అనుసంధానం పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. మొత్తం 33.5 కి.మీ కు గానూ ఇంకా 8.5 కి.మీ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆ పనులన్నీ ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని పట్టుదలతో ఏపి ప్రభుత్వం ఉంది.

First Published:  19 Sep 2020 12:43 AM GMT
Next Story