ఇకపై సినిమాల మధ్య ఓటీటీ పోటీ

ఓ మంచి తేదీ దొరికితే బాక్సాఫీస్ బరిలో సినిమాలు కొట్టుకోవడం మొన్నటివరకు చూశాం. ఇప్పుడదే పోటీ ఓటీటీకి షిఫ్ట్ అయింది. మంచి డేట్ దొరికితే స్ట్రీమింగ్ పెట్టాలని ఓటీటీలు చూస్తున్నాయి. ఇందులో భాగంగా ఫస్ట్ టైమ్ టాలీవుడ్ కు సంబంధించి ఓటీటీ పోటీ షురూ అయింది.

రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా సినిమాను అక్టోబర్ 2న ఆహాలో స్ట్రీమింగ్ కు పెట్టారు. అదే రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ తమ యాప్ లో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టింది. ఇలా కాస్త క్రేజ్ ఉన్న రెండు సినిమాలు ఓటీటీలో ఒకే రోజు రిలీజై, పోటీ పడుతున్నాయి.

ఒరేయ్ బుజ్జిగా సినిమాపై మేకర్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈసారి తనకు హిట్ గ్యారెంటీ అంటున్నాడు రాజ్ తరుణ్. అటు నిశ్శబ్దం యూనిట్ కూడా ఇన్నాళ్లకు తన మౌనాన్ని వీడింది. తమ సినిమా అమెజాన్ లో వస్తోందని, తప్పకుండా హిట్ అవుతుందని చెబుతోంది.

మరి ఈ రెండు సినిమాల్లో ఏది క్లిక్ అయిందో తెలియాలంటే.. 1వ తేదీ అర్థరాత్రి వరకు వెయిట్ చేయాల్సిందే. 2వ తేదీ ఉదయం 10 గంటలకల్లా ఫుల్ ఫీడ్ బ్యాక్ వచ్చేస్తుంది.