టీడీపీని వీడనున్న వాసుపల్లి గణేష్‌

టీడీపీ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నేడు టీడీపీని వీడనున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని ఆయన కుమారుడితో పాటు వెళ్లి వాసుపల్లి గణేష్ కలుస్తారని టీడీపీ పత్రికలు రెండు ప్రచురించాయి.

విశాఖను పరిపాలన రాజధానిగా చంద్రబాబు వ్యతిరేకిస్తుండడంతో వాసుపల్లి గణేష్ అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు.

టీడీపీ నుంచి గెలిచిన 23 మందిలో ఇప్పటికే వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరిలు టీడీపీని వీడారు. ఇప్పుడు వాసుపల్లి కూడా వీడితే టీడీపీ సంఖ్యాబలం 19కి పడిపోతుంది. వాసుపల్లి గణేష్ నిన్నటి నుంచి టీడీపీ నేతలకు ఫోన్ లలో అందుబాటులో లేరు.