మరో మెగా ప్రకటన…

మెగాస్టార్ చిరంజీవి నుంచి మరో ప్రకటన రాబోతోందా.. దానికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయా.. అవుననే అంటున్నారు మెగా కాంపౌండ్ వ్యక్తులు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే వారం చిరంజీవి నుంచి కొత్త సినిమా ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.

ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు చిరు. ఆ మూవీ తర్వాత ఏ సినిమా ప్రకటిస్తాడనే సస్పెన్స్ చాలా నడుస్తోంది. ఎఁదుకంటే చిరు పైప్ లైన్లో చాలా సినిమాలు, దర్శకులు పెండింగ్ లో ఉన్నారు. వీవీ వినాయక్, బాబి, మెహర్ రమేష్, త్రివిక్రమ్.. ఇలా చాలామంది దర్శకులు వెయిటింగ్ లో ఉన్నారు.

ఈ నేపథ్యంలో తన నెక్ట్స్ సినిమా సస్పెన్స్ కు తెరదించాలని చిరంజీవి భావిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మెహర్ రమేష్ తో చేయాల్సిన వేదాళం రీమేక్ ప్రాజెక్టును వచ్చే వారం చిరంజీవి ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ మేరకు చిన్నపాటి మోషన్ టీజర్ లాంటిది ఒకటి ఎడిటింగ్ స్టేజ్ లో ఉందని సమాచారం.

ఇదే కనుక నిజమైతే మెహర్ రమేష్ జాక్ పాట్ కొట్టినట్టే. ఇన్నేళ్లూ మెగాఫోన్ కు దూరమైన మెహర్.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ నే డైరక్ట్ చేసే అవకాశం అందుకోబోతున్నాడన్నమాట. అలా అట్టర్ ఫ్లాప్ డైరక్టర్ కు అవకాశం ఇస్తున్నారు చిరంజీవి. పాపం.. మెగాఫ్యాన్స్ ముఖచిత్రం ఏంటో?