Telugu Global
National

ప్రజలే జడ్జిలను విమర్శిస్తున్నారంటే పరిస్థితి ఎంత దూరం వచ్చిందో గుర్తించాలి- జస్టిస్ శేషశయనా

ఏపీ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషశయనా రెడ్డి స్పందించింది. ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు కొందరు బెంచ్‌ మీద నుంచి ఘాటు వ్యాఖ్యలు చేస్తుండడాన్ని ఆయన తప్పు పట్టారు. న్యాయమూర్తులు ఇచ్చే తీర్పుల్లో లోపాలను ఎత్తి చూపడం సర్వసాధారణమని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులే విమర్శలకు అవకాశం ఇచ్చేలా వ్యవహరించకుండా ఉండాలని సూచించారు. బెంచ్‌పై నుంచి న్యాయమూర్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. చెప్పాలనుకున్నది తీర్పుల ద్వారానే చెప్పాలన్నారు. న్యాయమూర్తుల తీర్పులు మాట్లాడాలే […]

ప్రజలే జడ్జిలను విమర్శిస్తున్నారంటే పరిస్థితి ఎంత దూరం వచ్చిందో గుర్తించాలి- జస్టిస్ శేషశయనా
X

ఏపీ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషశయనా రెడ్డి స్పందించింది. ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు కొందరు బెంచ్‌ మీద నుంచి ఘాటు వ్యాఖ్యలు చేస్తుండడాన్ని ఆయన తప్పు పట్టారు. న్యాయమూర్తులు ఇచ్చే తీర్పుల్లో లోపాలను ఎత్తి చూపడం సర్వసాధారణమని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులే విమర్శలకు అవకాశం ఇచ్చేలా వ్యవహరించకుండా ఉండాలని సూచించారు.

బెంచ్‌పై నుంచి న్యాయమూర్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. చెప్పాలనుకున్నది తీర్పుల ద్వారానే చెప్పాలన్నారు. న్యాయమూర్తుల తీర్పులు మాట్లాడాలే కానీ.. న్యాయమూర్తులే మాట్లాడకూడదని… కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజలు కూడా న్యాయవ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద విమర్శలకు దిగుతున్నారంటే… పరిస్థితిని ఎంత దూరం తెచ్చుకున్నామో ఆలోచించుకోవాలని సూచించారు.

ఈ పరిణామం వల్ల జడ్జిల మీద ప్రజల్లో అనేక సందేహాలు నెలకొనేందుకు ఆస్కారం కల్పించినట్టు అయిందని శేషశయనా రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో జడ్జిలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు.

First Published:  19 Sep 2020 9:29 PM GMT
Next Story