ఆ దర్శకుడు రేప్ చేయబోయాడు…

బాలీవుడ్ లో మరో కాస్టింగ్ కౌచ్ ఘటన వెలుగుచూసింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై అఘాయిత్యానికి ప్రయత్నించాడని ఆరోపించింది నటి పాయల్ ఘోష్. తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్.. కొన్నేళ్ల కిందట అనురాగ్ తనను రేప్ చేయడానికి ప్రయత్నించాడని ప్రకటించి సంచలనం సృష్టించింది.

అనురాగ్ కశ్యప్ తో పాయల్ కు వరుసగా మీటింగ్స్ జరిగాయట. మొదటి మీటింగ్ బాగానే ఉంది. రెండో మీటింగ్ లో కమిట్ మెంట్ అడిగాడట. మూడో మీటింగ్ కు వచ్చేసరికి, ఏకంగా ఓ గదిలోకి తీసుకెళ్లి జిప్ తీశాడని చెప్పుకొచ్చింది పాయల్. తన మనసు బాగా లేదంటూ ఏదో చెప్పి అక్కడ్నుంచి తప్పించుకున్నానని అంటోంది. ఇదే హీరోయిన్ కొన్ని రోజుల కిందట ప్రకటన చేస్తూ.. ఓ బాలీవుడ్ దర్శకుడు తనకు నీలి చిత్రాలు చూపించాడంటూ ఆరోపించింది. ఆ దర్శకుడు, అనురాగ్ కశ్యప్ ఒక్కడేనా అనేది ఇప్పుడు అందరి సందేహం.

అయితే పాయల్ ఆరోపణల్ని వెంటనే తిప్పికొట్టాడు అనురాగ్ కశ్వప్. తను ఎప్పుడూ, ఎవ్వరితో అనైతికంగా ప్రవర్తించలేదని తెలిపిన ఈ దర్శకుడు.. ఈ వ్యవహారంలోకి మరో ముగ్గురు హీరోయిన్లను పాయల్ లాగడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. మరీ ముఖ్యంగా బచ్చన్ కుటుంబాన్ని ప్రస్తావించడాన్ని కూడా ఆయన వ్యతిరేకించాడు. దీనిపై తదుపరి జరిగే ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించాడు.