పుష్పలో కూడా పులి ఫైట్

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప సినిమాపై ఇంట్రెస్టింగ్ మేటర్ బయటకొచ్చింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పులి ఫైట్ ఉందట. బన్నీకి-పులికి మధ్య వచ్చే ఈ ఫైట్ సినిమాకే స్పెషల్ ఎట్రాక్షన్ అంటోంది యూనిట్.

ఇండియాలో జంతువులపై షూటింగ్ నిషేధం. కావాలంటే గ్రాఫిక్స్ లో చేసుకోవచ్చు. కానీ పుష్ప యూనిట్ కు అది ఇష్టం లేదు. అందుకే ఈ పులి ఫైట్ కోసం వియత్నాం వెళ్లాలని నిర్ణయించుకుందట. వియత్నాంలో పెంపుడు పులులు ఉంటాయి. పైగా షూటింగ్ కు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఈ ఎపిసోడ్ ను అక్కడ పూర్తిచేయాలని అనుకుంటున్నారట.

రాజమౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ లో కూడా పులి ఫైట్ ఉంది. సినిమాలో ఎన్టీఆర్ పై ఓ బ్రహ్మాండమైన పులి ఫైట్ తీశాడు రాజమౌళి. దీనికి సంబంధించి చిన్నపాటి వీడియో, ఫొటోలు కూడా ఆమధ్య లీక్ అయ్యాయి.

వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాల్లో ఏ పులి ఫైట్ బాగుంటుందో చూడాలి.